
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణరెడ్డికి నజరానాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రకటించగా... తాజాగా దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) గ్రూప్ ‘సి’ ఉద్యోగాన్ని కేటాయించింది.
అంతర్జాతీయ వేదికపై అదరగొట్టిన అరుణకు ఎస్‌సీఆర్‌లో ఉద్యోగం కేటాయించడం సంతోషంగా ఉందని జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు.