కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలకు ముందు భారత బ్యాడ్మింటన్ బృందం
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ లాంఛనం ముగియడంతో... నేటి నుంచి క్రీడాకారులు ఇక పతకాల వేట మొదలుపెట్టనున్నారు. తొలి రోజు స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ట్రయాథ్లాన్ క్రీడాంశాల్లో మొత్తం 16 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. ట్రయాథ్లాన్ మినహాయిస్తే మిగతా మూడు ఈవెంట్స్‌లో భారత ఆటగాళ్లు క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళితేనే పతకాల రేసులో ఉంటారు. ఇతర క్రీడాంశాల్లో తొలిరోజు పోటీపడనున్న భారత క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి.
పురుషుల బాక్సింగ్ (తొలి రౌండ్): శివ థాపా గీ సులేమాన్ (పాకిస్తాన్–63.5 కేజీలు; సాయంత్రం గం. 4:30 నుంచి)
మహిళల టి20 క్రికెట్: భారత్ గీ ఆస్ట్రేలియా (మ. గం. 3:30 నుంచి).
మహిళల హాకీ లీగ్ మ్యాచ్: భారత్ గీ ఘనా (సాయంత్రం గం. 6:30 నుంచి).
బ్యాడ్మింటన్ (మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్): భారత్ గీ పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 2 నుంచి)
స్విమ్మింగ్ (హీట్స్; మధ్యాహ్నం గం. 3 నుంచి): సజన్ (50 మీటర్ల బటర్‌ఫ్లయ్), శ్రీహరి (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్), కుశాగ్ర (400 మీటర్ల ఫ్రీస్టయి ల్; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 11:35), ఆశిష్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్; పారా స్విమ్మింగ్).
స్క్వాష్ (తొలి రౌండ్): అనాహత్ సింగ్ గీ జాడా రోస్ (సెయింట్ విన్సెంట్; రాత్రి గం. 11 నుంచి); అభయ్ సింగ్ గీ జో చాప్‌మన్ (బ్రిటిష్ వర్జీన్
ఐలాండ్స్; రాత్రి గం. 11:45 నుంచి).
టేబుల్ టెన్నిస్ (టీమ్ లీగ్ మ్యాచ్‌లు): మహిళల విభాగం: భారత్ గీ దక్షిణాఫ్రికా (మధ్యాహ్నం గం. 2 నుంచి); భారత్ గీ ఫిజీ (రాత్రి గం. 8:30
నుంచి); పురుషుల విభాగం: భారత్ గీ బార్బడోస్ (సాయంత్రం గం. 4:30 నుంచి); భారత్ గీ సింగపూర్ (రాత్రి గం. 11 నుంచి).
ట్రాక్ సైక్లింగ్: విశ్వజీత్, నమన్, వెంకప్ప, అనంత, దినేశ్ (పురుషుల టీమ్ పర్సూట్ క్వాలిఫయింగ్: మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). రోజిత్, రొనాల్డో, డేవిడ్, ఎసో (పురుషుల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). మయూరి, త్రియష, శశికళ (మహిళల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్; గం. 8:30 నుంచి).
ట్రయాథ్లాన్: ఆదర్శ్, విశ్వనాథ్ యాదవ్ (పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3:30 నుంచి); ప్రజ్ఞా మోహన్, సంజన జోషి (మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3: 30 నుంచి).
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: యోగేశ్వర్, సత్యజిత్, సైఫ్ (క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 1:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 10 నుంచి).
Comments
Please login to add a commentAdd a comment