track cycling
-
పార్కింగ్ అడ్డాగా సైక్లింగ్ ట్రాక్!
హైదరాబాద్: నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల కోసం రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లను జీహెచ్ఎంసీ అధికారులు నిర్మిస్తున్నారు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా సైకిల్ ట్రాక్‌లను అభివృద్ధి చేసి నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికలకు ముందు హడావుడిగా పనులు చేపట్టారు. ఇదే క్రమంలో ఎల్బీనగర్ పరిధిలో చేపట్టిన సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశాడు. అసంపూర్తిగా ఉన్న ఈ సైక్లింగ్ ట్రాక్ వాహనాల అక్రమ పార్కింగ్‌కు అడ్డాగా మారింది. ఉన్నతాధికారులు త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఈ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ► ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు సైకిల్ ట్రాక్ నిరి్మంచాలని నిర్ణయించిన అధికారులు 8 నెలల క్రితం పనులు ప్రారంభించారు. ► రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను తొలగించి ఫుట్‌పాత్‌కు వాహనాలు వెళ్లే రోడ్డు మధ్య సుమారు పది అడుగుల వెడల్పులో ట్రాక్ నిర్మాణం మొదలు పెట్టారు. నాగోలు నుంచి ఆదర్శనగర్ వరకు, ఎల్బీనగర్ శివగంగ కాలనీ దగ్గర కొంత మేరకు పనులు చేసిన కాంట్రాక్టర్ మధ్యలో ఆపేశాడు. ► గత ప్రభుత్వంలో పనులు మొదలెట్టిన కాంట్రాక్టర్ ఇప్పడు చేయకపోవడంతో ఎక్కడిక్కడే నిలిచిపోయి. అర్ధంతరంగా పనులు నిలిపివేసి ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► సైకిల్ ట్రాక్ పూర్తిగా ఉపయోగంలోకి రాక పోవడంతో కొంత మంది అక్కడ తమ వాహనాలను నిలుపుకుంటూ పార్కింగ్ స్ధలాలుగా ఉపయోగించుకుంటున్నారు. ►జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు పట్టించుకోక పోవడంతో కోట్లది రూపాయలతో నిరి్మంచిన సైకిల్ ట్రాక్ అక్రమ పార్కింగ్‌కు అడ్డగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ► అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలు ప్రారంభించకుండానే ట్రాక్ ధ్వంసమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ► కాంట్రాక్టర్‌కు సకాంలో బిల్లులు రాకపోవడంతోనే పనులను పూర్తి చేయడం లేదని తెలుస్తోంది. ► సైక్లింగ్ ట్రాక్ పనులను కాంట్రాక్టర్ ► నిలిపి వేయడంతో ఈ పనులు అసలు పూర్తవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ► జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకొని సైక్లింగ్ ట్రాక్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
సీఎంని కలిసిన క్రీడాకారులు బేబిరెడ్డి, అర్షద్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబిరెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో (జూనియర్స్ టీమ్)లో బేబిరెడ్డి టీమ్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లెకు చెందిన బేబిరెడ్డి తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపించారు. పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ క్రీడాకారుడు షేక్ అర్షద్‌ను అభినందిస్తున్న సీఎం జగన్, పక్కన కోచ్ ఆదిత్య మెహతా జాతీయస్థాయిలో టీమ్ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎంకు చెప్పారు. నంద్యాలకు చెందిన షేక్ అర్షద్ ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్‌లో వెండి, కాంస్య పతకాలు సాధించారు. అర్షద్ తాను జాతీయస్థాయిలో సాధించిన పతకాలను కూడా సీఎం జగన్‌కు చూపించారు. అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో జరగనున్న ట్రాక్ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎం జగన్‌ని బేబిరెడ్డి, అర్షద్ కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంని కలిసిన వారిలో బేబిరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, కుటుంబసభ్యులు శ్రీనివాసులురెడ్డి, వెంకట్రామిరెడ్డి, అర్షద్ కోచ్ ఆదిత్య మెహతా ఉన్నారు. -
క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తాం: సీఎం జగన్
-
Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా?
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ లాంఛనం ముగియడంతో... నేటి నుంచి క్రీడాకారులు ఇక పతకాల వేట మొదలుపెట్టనున్నారు. తొలి రోజు స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ట్రయాథ్లాన్ క్రీడాంశాల్లో మొత్తం 16 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. ట్రయాథ్లాన్ మినహాయిస్తే మిగతా మూడు ఈవెంట్స్‌లో భారత ఆటగాళ్లు క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళితేనే పతకాల రేసులో ఉంటారు. ఇతర క్రీడాంశాల్లో తొలిరోజు పోటీపడనున్న భారత క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల బాక్సింగ్ (తొలి రౌండ్): శివ థాపా గీ సులేమాన్ (పాకిస్తాన్–63.5 కేజీలు; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్: భారత్ గీ ఆస్ట్రేలియా (మ. గం. 3:30 నుంచి). మహిళల హాకీ లీగ్ మ్యాచ్: భారత్ గీ ఘనా (సాయంత్రం గం. 6:30 నుంచి). బ్యాడ్మింటన్ (మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్): భారత్ గీ పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 2 నుంచి) స్విమ్మింగ్ (హీట్స్; మధ్యాహ్నం గం. 3 నుంచి): సజన్ (50 మీటర్ల బటర్‌ఫ్లయ్), శ్రీహరి (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్), కుశాగ్ర (400 మీటర్ల ఫ్రీస్టయి ల్; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 11:35), ఆశిష్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్; పారా స్విమ్మింగ్). స్క్వాష్ (తొలి రౌండ్): అనాహత్ సింగ్ గీ జాడా రోస్ (సెయింట్ విన్సెంట్; రాత్రి గం. 11 నుంచి); అభయ్ సింగ్ గీ జో చాప్మన్ (బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్; రాత్రి గం. 11:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (టీమ్ లీగ్ మ్యాచ్‌లు): మహిళల విభాగం: భారత్ గీ దక్షిణాఫ్రికా (మధ్యాహ్నం గం. 2 నుంచి); భారత్ గీ ఫిజీ (రాత్రి గం. 8:30 నుంచి); పురుషుల విభాగం: భారత్ గీ బార్బడోస్ (సాయంత్రం గం. 4:30 నుంచి); భారత్ గీ సింగపూర్ (రాత్రి గం. 11 నుంచి). ట్రాక్ సైక్లింగ్: విశ్వజీత్, నమన్, వెంకప్ప, అనంత, దినేశ్ (పురుషుల టీమ్ పర్సూట్ క్వాలిఫయింగ్: మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). రోజిత్, రొనాల్డో, డేవిడ్, ఎసో (పురుషుల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). మయూరి, త్రియష, శశికళ (మహిళల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్; గం. 8:30 నుంచి). ట్రయాథ్లాన్: ఆదర్శ్, విశ్వనాథ్ యాదవ్ (పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3:30 నుంచి); ప్రజ్ఞా మోహన్, సంజన జోషి (మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3: 30 నుంచి). ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: యోగేశ్వర్, సత్యజిత్, సైఫ్ (క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 1:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 10 నుంచి). -
అభినందన్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు అభినందన్ సత్తా చాటాడు. కేరళలోని త్రివేండ్రం లో జరుగుతోన్న ఈ పోటీల్లో ఎలైట్ మెన్ 15కి.మీ స్క్రాచ్ రేసులో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం అభినందన్ దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా పనిచేస్తున్నాడు.