
పాపులర్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ మిష్ శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్టన్నింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది శర్మ. తాజా విషయానికి వస్తే... చీర ధరించి అద్భుతమైన రీతిలో చేసిన జిమ్నాస్టిక్స్ నెటిజనుల చేత ‘వావ్’ అనిపించాయి. మరో అథ్లెట్ పారుల్ శర్మ చీర ధరించి చేసిన జిమ్నాస్టిక్స్ అబ్బురపరిచాయి.
‘మన టాలెంట్ ముఖ్యం కానీ ఎలాంటి దుస్తులు ధరించామనేది ముఖ్యం కాదు’ అని ఒకరు కామెంట్ రాశారు. అయితే పారుల్ మాత్రం తన వీడియో చూసి ప్రయోగాలు చేయవద్దని సలహా ఇచ్చింది. ‘స్టంట్స్ చేయడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. ఒకస్థాయి వరకు శిక్షణ తీసుకోవడం అవసరం. నైపుణ్యం సాధించిన తరువాతే ప్రయత్నించాలి. లేని కష్టాలు కొని తెచ్చుకోవద్దు’ అని చెప్పింది పారుల్.