
అందం, అభినయంతో సినీ పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగిన నటి సమంత రూత్ ప్రభు. మోడల్ నుంచి మొదలై స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, అంతే దృఢంగా నిలబడుతోంది. ఆరోగ్యం సహకరించక పోయినా అచంచల విశ్వాసంతో తన కలల సాకారంకోసం నిబద్ధతగా సాగుతోంది. పురుషాధిక్య సినీ ప్రపంచంలో హీరోయిన్‌గా రాణిస్తోంది.
అలాగే సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటూ అనేక ఆరోగ్య విషయాలను పంచుకోవడం సమంతాకు అలవాటు. ఈ క్రమంలో తన దినచర్య వివరాలను పంచుకుంది. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, క్రీడలతోపాటు, వృత్తి జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ తన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకుంటోంది అనే ‘ది డే ఇన్ మే లైఫ్’ అనే చిన్న వీడియోలో షేర్ చేసింది. ఆరోగ్యాన్ని, వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తన అభిమానులకు చెప్పకనే చెప్పేసింది. ఆరోగ్యం పట్ల సమంత తీసుకుంటున్న శ్రద్ధకు, ఫిటె్‌నెస్‌కు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే మీరు స్టార్. చాలా స్ఫూర్తి దాయకం! అంటూ కమెంట్ చేశారు.
కాగా మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ ఫీనిక్స్ పక్షిలో తనను తాను నిరూపించుకుఉంటోంది. ఈక్రమంలోనే ప్రతిష్టాత్మక “సిటాడెల్” సిరీస్‌తో బాగానే ఆకట్టుకుంది. అలాగే వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా కొత్త ప్రయాణం ప్రారంభించినట్టు సమంత స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment