బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ...ఈ పేరు వినగానే శిల్వం లాంటి ఆమె శరీర ఆకృతి గుర్తు వస్తుంది. శిల్పాశెట్టి పెద్ద ఫిట్‌నెస్ ఫ్రీక్. అందుకే యాభైయ్యవ పడి దగ్గరపడుతున్నా టోన్డ్, ఫిట్ బాడీతో 90వ దశకంలో ఎంత ఫిట్‌గా, అందంగా ఉందో ఇప్పటికీ అదే సౌష్టవాన్ని మెయింటైన్ చేస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే అంతకు మించి. చక్కని ఆహార అలవాట్లు, చక్కటి వ్యాయామమే ఆమె సౌందర్య రహస్యం. ఇప్పటికీ యోగాసనాలతో అభిమానులను ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటుంది. తాజా మండే మోటివేషన్ అంటూ ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
స్విస్ బాల్‌లో ప్రోన్ రివర్స్ హైపర్‌ల గురించి ఈ వీడియోలో తెలిపింది శిల్పా శెట్టి.. ఇది చాలా సింపుల్. వెన్నుముక, పిరుదులకు చాలా బలమైన వ్యాయామం ఇది. అదే సమయంలో బాలెన్స్‌ను కాపాడుకోవడానికి కూడా మంచిది. జీవితంలో, వృత్తిలో, రెండింటిలో బలాన్ని పెంపొందించడానికి, సమన్వయాన్ని మెరుగుపరచడాని, స్టెబిలిటీకి చాలా మంచిది అంటూ ఈ వ్యాయామం గురించి చెప్పుకొచ్చింది. మీ రొటీన్‌లో ఎక్స్‌ర్‌సైజ్‌లో 15-20 సార్లు మధ్యలో 45 సెకన్లపాటు విరామం తీసుకుని మూడుసార్లు చేయాలని వివరించింది. చిన్ని చిన్న అడుగులతోనే పురోగతి మొదలవుతుంది అనే సందేశాన్ని కూడా ఫ్యాన్స్‌కు ఇచ్చేసింది.
అంతేకాదు కార్తీక సోమవారం సందర్బంగా ఉజ్జయినిలోని మహాకాల్ నగరంలో పరమశివుణ్ణి దర్శించుకుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా మహాకాల్ జ్యోతిర్లింగం వద్ద భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఈ విషయాలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. (గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి! )
Comments
Please login to add a commentAdd a comment