వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా? | Woman Dislocate Shoulder To Fall Asleep Comfortably Goes Viral | Sakshi

వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?

Jul 21 2024 8:44 AM | Updated on Jul 21 2024 12:06 PM

Woman Dislocate Shoulder To Fall Asleep Comfortably Goes Viral

‘నిద్రపోయే ముందు మీరు ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు– ‘చక్కని సంగీతం వింటాను. నచ్చిన పుస్తకం చదువుకుంటాను’... ఇలాంటి జవాబులు వినిపించడం సాధారణమే. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ టియా విల్సన్‌ నోటి నుంచి వచ్చిన మాట విని నెట్‌ లోకులు షాకు అయ్యారు. ‘సౌకర్యవంతంగా. సుఖంగా నిద్రపోవడానికి నా భుజాన్ని డిస్‌లొకేట్‌ చేస్తాను. నిద్ర నుంచి లేచిన తరువాత తరిగి యథాస్థానంలో అమర్చుకుంటాను’ అంటుంది విల్సన్‌. ‘జోక్‌ చేస్తోందా?’ అనుకోవద్దు. 

ఆమె చెప్పింది నిజమే. ఎహ్లర్స్‌ డాన్లోస్‌ సిండ్రోమ్‌ (ఈడీఎస్‌)తో బాధపడుతోంది టియా విల్సన్‌. ‘ఈడీఎస్‌’ అనేది జన్యుపరమైన రుగ్మత. చర్మం సాగదీయబడినట్లుగా ఉంటుంది. కీళ్లు వదులవుతాయి. చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. భుజాన్ని డిస్‌లొకేట్‌ చేసినప్పుడు అచేతనంగా మారి వేలాడబడుతున్నట్లుగా ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ‘హౌ ఐ స్లీప్‌’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో టియా విల్సన్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో రెండు మిలియన్‌ల వీక్షకుల గుండెలను చెమ్మగిల్లేలా చేసింది.

 

 (చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు..చివరికి?)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement