ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ప్యాకేజింగ్ ఆహారా పదార్థాలు ఆయా కంపెనీలు లేబుల్ చేసినట్లు ఆరోగ్యకరమైనవి కావడం లేదు. మొదట్లో అడ్వర్టైస్‌మెంట్లతో ఊదరగొట్టి చివరికీ.. అవే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు పెదవివిరవడం చూస్తూనే ఉన్నాం. అయినా అవేమీ వాటి తీరు మార్చుకోవు. మనం కూడా గత్యంతర లేకనో అలవాటు పడో గానీ అవే కొనేస్తున్నాం. కానీ ఇక్కడొక ఇన్‌స్టాగ్రాం వినియోగదారుడు ఒక్క వీడియోతో ప్రముఖ కంపెనీని షేక్ చేశాడు. దెబ్బకు దిగొచ్చి తీరు మార్చుకునేలా చేశాడు.
వివరాల్లోకెల్తే..ఓ ఇన్‌స్టాగ్రాం ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ హిమంత్ సింకా అకా ప్రముఖ క్యాడ్‌బరీ సంస్థకి చెందిన బోర్న్‌విటా చాక్లెట్స్, హెల్త్ డ్రింగ్‌లో చక్కెర కంటెంట్ అధికంగా ఉందని ప్రూవ్ చేశాడు. బోర్న్‌విటా ప్రతి వందగ్రాముల పొడిలో సుమారు 37.4 గ్రాముల చక్కెర ఉందని వాదించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఇది నిజంగా ఆరోగ్యానికి హానికరమైనదని డయాబెటిస్ పేషెంట్లుగా మారుస్తుందని విమర్శలు చేశారు.
పైగా ఆ కంపెనీ లెబుల్‌పై చెబుతున్నవన్నీ అబద్ధాలే అని ప్రజలను మాయం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఇందులో వాడే షుగర్ వల్ల డయాబెటిస్, ఉపయోగిస్తున్న ఫుడ్ కలర్స్ క్యాన్సర్‌కి దారితీస్తుందని చెప్పారు. తాను పోషకాహార నిపుణుడనని, ఆరోగ్య నిపుణుడిగా దీన్ని బల్లగుద్ది చెప్పగలనని అన్నారు. ఆ బ్రాండ్ టాగ్‌లైన్‌పై కూడా హిమంత్ సింకా విమర్శలు కురిపించారు. అయితే కంపెనీ తొలుత అవన్నీ అశాస్త్రీయమైనవంటూ కొట్టిపారేసింది. పైగా హిమంత్ సింకాకి లీగల్ నోటీసులు కూడా పంపించింది సదరు బోర్న్‌విటా కంపెనీ. అయితే హిమంత్ విడుదల చేసిన వీడియో అప్పటికీ నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యింది.
Bournvita.. is it... I'm Shocked 😳😳😳😳
— Prof Dr Shibu A (@shibu_prof) April 5, 2023
I am a victim from childhood #bournvita #childhood #victim #young #india pic.twitter.com/gmiI3tci4e
అదీగాక ఈ వీడియోని రాజకీయవేత్త పరేష్ రావల్, మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ కూడా షేర్ చేశారు. దీంతో ఎనిమిది మంది వైద్యులు, పోషకాహార నిపుణులతో కూడిన ప్రముఖ భారతీయ పోషకాహార సంస్థ హిమత్‌సింకా వీడియోలో చెప్పింది కచ్చితమైనదని ధృవీకరించింది. దెబ్బకు బోర్న్ విటా కంపెనీ దిగొచ్చి చక్కెర పరిమాణాన్ని సుమారు 14.4% మేర దిగొచ్చింది. చరిత్రలో తొలిసారి ఇలా విమర్శలు అందుకున్న వెంటనే ఓ కంపెనీ మార్పుకి నాంది పలికి షుగర్ కంటెంట్‌ని తగ్గించింది.
దీంతో ఏ కంపెనీ తప్పుగా లేబుల్ చేస్తూ మార్కెట్ చేసే సాహసం చేయదని అన్నారు హిమంత్ సింకా. ఆరోగ్యకరమైన ఆహారం కోసం చేసిన పోరాటం ఇది, కేవలం బోర్న్ విటాకు వ్యతిరేకం కాదని అన్నారు. జంక్‌పుడ్ విక్రయించే ఏ కంపెనీకి అయినా తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తా, ముఖ్యంగా దాని లేబుల్‌పై తప్పుడు ప్రచారం చేస్తే అస్సలు ఉపేక్షించనని అన్నారు. ఈ ఘటనతో ప్రతి కంపెనీ ప్యాకేజింగ్ ఫుడ్ విషయంలో తప్పక జాగ్రత్త పడుతుంది. ఇది మాములు విజయం కాదు 'బిగ్ విన్'. ఎందుకంటే? ఒక్క వీడియోతో కంపెనీ మూలాలే కదిలిపోయాలా చేశాడు హిమంత్ సింకా.
(చదవండి: పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాణాంతక వ్యాధా? ఎలా నివారించాలి?)
Comments
Please login to add a commentAdd a comment