జిమ్నాస్టిక్స్ | Gymnastics | Sakshi
Sakshi News home page

జిమ్నాస్టిక్స్

Published Thu, Jul 21 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

Gymnastics

అందుబాటులో ఉన్న స్వర్ణాలు 18
(ఆర్టిస్టిక్ 14+ రిథమిక్ 2+ ట్రెంపోలిన్ 2)

 

ఖేల్  కహానీ
శరీరాన్ని విల్లులా వంచడం, స్ప్రింగ్‌లా మెలిక తిప్పడం, చిన్న ఆధారంపై పెద్దపెద్ద విన్యాసాలు చేయడం జిమ్నాస్టిక్స్ ప్రత్యేకత. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. వాటిలో దేనికదే సాటి. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో బ్యాలెన్స్ బీమ్, పామెల్ హార్స్, పారలల్ బార్స్, రింగ్స్, ఫ్లోర్, వాల్టింగ్ హార్స్, అన్‌ఈవెన్ బార్స్‌పై విన్యాసాలు చేస్తారు. ఏథెన్స్ (1896) ఒలింపిక్స్ నుంచి ఇవి జరుగుతున్నాయి. రిథమిక్ జిమ్నాస్టిక్స్ కేవలం మహిళలకే పరిమితం. అందమైన అమ్మాయిలు సంగీతానికి అనుగుణంగా లయ బద్దంగా విన్యాసాలను చూపిస్తారు. 1984లో ఈ విభాగాన్ని ప్రవేశపెట్టారు. అద్భుతమైన డ్రెస్సింగ్‌తో కళ్లు చెదిరే విన్యాసాలు ప్రదర్శిస్తూ జడ్జీలను ఆకట్టుకోవాలి. ఇందులో వ్యక్తిగతంగానూ టీమ్ విభాగాల్లోనూ పోటీలు ఉంటాయి. గాల్లో తేలాడుతూ విన్యాసాలు చేయడం ట్రెంపోలిన్ ప్రత్యేకత. ఓ ప్రత్యేకమైన వలలో పడిన తర్వాత దాదాపు 8 మీటర్లు పైకి లేస్తారు. సోమర్‌సాల్ట్స్, ఏరియల్ ఏక్రోబ్యాటిక్స్‌లో రకరకాల విన్యాసాలు ఉంటాయి. సిడ్నీ ఒలింపిక్స్‌లో వీటిని ప్రవేశపెట్టారు.

రష్యాదే జోరు...
రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో రష్యాదే ఆధిపత్యం. 1964 టోక్యో గేమ్స్‌లో 6 స్వర్ణాలు నెగ్గిన లారిసా లాతియానా తర్వాత మెక్సికోలోనూ 7 స్వర్ణాలతో దుమ్మురేపింది. ఇప్పటికీ టాప్-3లో రష్యా అథ్లెట్లే ఉంటున్నారు. తర్వాత ఉక్రెయిన్, కొరియా, బెలారస్, ఇజ్రాయిల్, బల్గేరియా జిమ్నాస్ట్‌లు సత్తా చాటుతున్నారు. ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్‌లో అమెరికాదే జోరు. పురుషుల, మహిళల విభాగాల్లో వాళ్లను కొట్టేవారు లేరు. తర్వాత బ్రిటన్, బ్రెజిల్, జపాన్, చైనా, స్విట్జర్లాండ్‌లు అటు ఇటుగా ఉన్నాయి. ట్రెంపోలిన్‌కు వచ్చేసరికి రష్యా, బెలారస్, చైనాల మధ్యే ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎక్కువగా రష్యా అథ్లెట్లదే పైచేయి. ఇక ప్రారంభ ఒలింపిక్స్‌లో జర్మనీ అన్ని పతకాలను కొల్లగొట్టేది. తర్వాత కొన్నాళ్లు బెల్జియం, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్‌ల హవా సాగింది. ఆ తర్వాత ఫ్రాన్స్ తన మార్క్‌ను చూపడం మొదలైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement