జిమ్నాస్టిక్స్ అంటేనే వ్యాయామ సంబధితమైన క్రీడ. ఈ ఆటకు బలం, సమతుల్యత, చురుకుదనం, ఓర్పుతో పాటు నియంత్రణ చాలా ముఖ్యం. కొంచెం పట్టుతప్పినా ప్రాణాల మీదకు వస్తుంది. అలాంటి జిమ్నాస్టిక్స్‌ను ప్రాణంగా భావించే ఓ క్రీడాకారిణి తన రెండు కాళ్లను విరగొట్టుకొని కేరిర్‌కే గుడ్‌బై చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అమెరికాలోని ఆబర్న్ యూనివర్సిటీకి చెందిన సమంతా సెరియో అనే జిమ్నాస్ట్.. శుక్రవారం జరిగిన బేటన్ రోగ్ రీజనల్ పోటీల్లో పాల్గొంది. ఫస్ట్ పాస్ చేస్తున్న సందర్భంలో ఆమె ఎగిరి మ్యాట్పై ల్యాం డ్ అయ్యింది. కానీ, ఆ ల్యాండింగ్ అదుపుతప్పడంతో రెండు కాళ్లూ మోకాళ్ల వద్ద విరిగిపోయాయి. నొప్పి తో ఆమె విలవిల్లాడిపోయింది. కొద్ది సేపటిదాకా ఎవరికీ ఏం అర్థం కాలేదు. తీవ్రమైననొప్పి తో ఆమె ఏడ్చే వరకూ కాళ్లు విరిగిన సంగతి అక్కడి వారికి తెలియలేదు. డాక్టర్లు వచ్చి ఆమెను స్ట్రెచర్పై అక్కడి నుంచి తీసుకెళ్లారు.
అయితే ఆమె గుడ్డిగా హ్యాండ్‌స్ప్రింగ్ ఫ్రంట్ ఫ్లిప్ చేయడం వల్లే రెండు కాళ్లు విరగిపోయాయని జిమ్నాస్టిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ తీవ్ర గాయంతో సమంత ఆరోజే తన జిమ్నాస్టిక్స్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. గత18 ఏళ్లుగా తన కెరీర్‌కు జిమ్నాస్టిక్స్ ఎంతగానో తోడ్పడిందని, అదే కష్టపడేతత్వాన్ని, గౌరవాన్ని, సమగ్రత, అంకితభావాన్ని నేర్పిందని చెబుతూ.. తనకు ఇష్టమైన ఆటకు దూరం అవుతున్నందుకు బాధగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం సమంత గాయానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment