'ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమించండి' | Football legend Prasun Banerjee recommends Dipa Karmakar as brand ambassador for gymnastics | Sakshi
Sakshi News home page

'ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమించండి'

Published Sat, Dec 10 2016 2:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

'ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమించండి'

'ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమించండి'

న్యూఢిల్లీ: ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో తృటిలో పతకాన్ని సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ను ఆ క్రీడకు బ్రాండ్ అంబాసిడర్గా చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు భారత ఫుట్ బాల్ దిగ్గజం, లోక్ సభ ఎంపీ ప్రసూన్ బెనర్జీ కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. భారత్లో జిమ్నాస్ట్కు మరింత ఆదరణ తీసుకురావాలంటే ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలంటూ ప్రసూన్ కోరారు.

 

' దీపా కర్మాకర్ కేవలం కళాత్మకమైన జిమ్నాస్టే కాదు.. ఈ ఏడాది రియోకు అర్హత సాధించి తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ . దాంతో పాటు గత 52 ఏళ్లలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత జిమ్నాస్ కూడా. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆమెను జిమ్నాస్ట్ అనే క్రీడకు బ్రాండ్ అంబాసిడర్ చేస్తే బాగుంటుంది. అలా చేస్తే ఇంకా  అత్యున్నత శిఖరాలను ఆమె అధిరోహించే అవకాశం ఉంది' అని ప్రసూన్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్రీడా మంత్రితో జరిగిన చర్చల్లో ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రసూన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement