గతవారం ఢిల్లీలో క్రీడా ఆవార్డుల కార్యక్రమం ముగిసింది. జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకూ అంతా రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా ఫోటోను ప్రముఖంగా ప్రచురించాయి. ప్రొఫెషనల్ టెన్నిస్ లో సానియా సాధించిన విజయాలకు ఖేల్ రత్న ఖచ్చితంగా సముచితమైన గౌరవమే..అయితే సానియా తో పాటు మరో డజను మంది ఆటగాళ్లు గత ఏడాది కాలంగా తమ తమ రంగాల్లో చూపిన అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డులు గెలుచుకున్నారు. దురదృష్ట వశాత్తు వీరిని మీడియా పట్టించుకోలేదు. అవార్డుల వెనక రాజకీయాలు... క్రీడా బోర్డుల అతి చొరవ, అనేక వివాదాలు మాత్రమే మీడియా దృష్టిని ఆకర్షస్తాయి. ఆటలంటే.. క్రికెట్, చెస్, సానియా, సైనాలు మాత్రమే కాదు అని ఎంతో మంది తమ అద్వితీయ ఆటతీరుతో నిరూపిస్తున్నా.. కోట్లాది భారతీయుల గుర్తింపునకు మాత్రం నోచుకోవడం లేదు.. అలాంటి అన్ సంగ్ హీరోస్ దేశంలో చాలా మందే ఉన్నా.. కనీసం ఈ ఏడాది రాష్ట్ర పతి చేతులతో అవార్డులు పొందిన క్రీడాకారుల ఎంత మంది మనకు తెలుసు.. ?
సందీప్ కుమార్: ఆర్చరీ
పూనేకి చెందిన సందీప్ కుమార్ ఆసియా క్రీడల్లో పటిష్ట కొరియాని మట్టి కరిపించి ఈ విభాగంలో తొలి బంగారు పతకాన్ని భారత్ కు అందించాడు.
పూనమ్మ: అథ్లెటిక్స్
ఆఫ్రికా, యూరప్, అమెరికాలు డామినేట్ చేసే ఈ విభాగంలో మన పూవమ్మ ప్రపంచ 42 రెండో ర్యాంక్ లో కొనసాగుతోంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400మీటర్ల వ్యక్తిగత కాంస్య పతకంతో పాటు, బంగారు పతకం గెలుచుకున్న 4X400 మీటర్ల రిలే టీమ్ లో సభ్యురాలు. అంతే కాదు ఆసియా స్థాయిలో బోలెడు వ్యక్తిగ పతకాలు సాధించి.. అర్జున అవార్డుకు అర్హత పొందింది.
దీపా కుమార్: జిమ్నాస్టిక్స్
జిమ్నాస్టిక్స్ లో దీపా కుమార్ చరిత్రే సృష్టించింది. గ్లాస్కో కామన్ వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించి.. ఈ విభాగంలో పోడియం ఫినిష్ ఇచ్చిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల్లో పతకం తృటిలో కోల్పోయినా.. దీపా ప్రదర్శన విమర్శకుల ప్రశంసలందుకుంది.
శ్రీజేష్ : హాకీ
మన జాతీయ క్రీడా హాకీలో అద్భుత ప్రదర్శనకు గానూ.. శ్రీజేష్ అర్జున అవార్డు అందుకున్నాడు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం అందుకున్న భారత జట్టు గోల్ కీపర్ శ్రీజేష్. అంతే కాదు. ఈ క్రీడల్లో పాకిస్తాన్ మ్యాచ్ లో శ్రీజేష్ అద్వితీయ ప్రదర్శన ఆయనకు ఆర్జున అవార్డు తెచ్చిపెట్టింది. ఫైనల్లో పాకిస్థాన్ సంధించిన రెండు పెనాల్టీ స్ట్రోక్ లను శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఇక 2014 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
సతీష్ కుమార్: వెయిట్ లిఫ్టింగ్
అనామకుడిగా కామన్ వెల్త్ క్రీడల్లో అడుగు పెట్టిన ఈ 23ఏల్ల తమిళనాడు క్రీడాకారుడు... 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో గేమ్స్ రికార్డు బద్దలు కొట్టడమే కాదు.. బంగారు పతకాన్ని సాధించాడు.
స్వరణ్ సింగ్ : రోయింగ్
2012 సమ్మర్ ఓలింపిక్స్ లో రోయింగ్ లో ఫైనల్ కు చేరిన స్వరణ్.... 2013 ఆసియా రోయింగ్ చాంఫియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. ఇక 2014 ఆసియా క్రీడల్లో తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతూ కూడా కాంస్య పతకాన్ని సాధించాడు.
ఇక అందరికంటే స్పెషల్ క్రీడాకారుడిని వరించి అర్జున అవార్డు మరింత వన్నెలద్దుకుంది. అతని పేరు శరత్ గైక్వాడ్. వివిద విభాగాల్లో అత్యధిక మెడల్స్ సాధించిన ప్రఖ్యాత క్రీడాకారిణి పీటీ ఉష రికార్డును బద్దలు కొట్టిన శరత్ బెంగుళూరు వాసి. 2014 ఆసియా క్రీడల్లో ప్యారా స్విమ్మింగ్ విభాగంలో 6 పతకాలు సాధించాడు. 2012లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న శరత్.. భారత్ తరఫున పారాలంపిక్స్ కు వెళ్లిన తొలి భారతీయ క్రీడాకారుడు కావడం గమనార్హం.
వీళ్లు మనకు తెలుసునా..!
Published Wed, Sep 2 2015 5:18 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement
Advertisement