విశ్వ క్రీడలకు భారత్‌ నుంచి 117 మంది.. ఏ విభాగంలో ఎందరు? | Paris Olympics 2024: IOA Releases List of 117 Athletes 140 Support Staff Members | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: విశ్వ క్రీడలకు భారత్‌ నుంచి 117 మంది.. ఏ విభాగంలో ఎందరు?

Published Wed, Jul 17 2024 1:56 PM | Last Updated on Wed, Jul 17 2024 3:29 PM

Paris Olympics 2024: IOA Releases List of 117 Athletes 140 Support Staff Members

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో పాల్గొననున్న భారత క్రీడాకారుల సంఖ్య ఖరారైంది. దేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వ క్రీడల్లో భాగం కానున్నారని భారత క్రీడా శాఖ అధికారికంగా వెల్లడించింది.

క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్‌కు వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌  క్రీడాకారుల జాబితాలో షాట్‌ పుట్టర్‌ అభా కతువా పేరు లేకపోవడం గమనార్హం.

అభా పేరు మాయం
వరల్డ్‌ ర్యాంకింగ్‌ కోటాలో ఆమె ప్యారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ , ఒలింపిక్‌ పార్టిసిపెంట్స్‌ లిస్టు నుంచి అభా పేరు మాయమైంది. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

కాగా ప్యారిస్‌ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెటిక్స్‌ బృందంలో 29 మంది ఉండగా.. ఇందులో 11 మంది మహిళా, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్‌ టీమ్‌లో 21 మంది ఉండగా.. హాకీ జట్టులో 19 మంది పేర్లు ఉన్నాయి.

ఇక టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఎనిమిది మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు, రెజ్లింగ్‌, ఆర్చరీ, బాక్సింగ్‌ విభాగాల్లో ఆరుగురు చొప్పున, నలుగురు గోల్ఫ్‌ క్రీడాకారులు, ముగ్గురు  టెన్నిస్‌  ప్లేయర్లు, సెయిలింగ్‌, స్విమ్మింగ్‌ నుంచి ఇద్దరు చొప్పున..

నాటి పసిడి ప్రత్యేకం
అదే విధంగా.. ఈక్వెస్ట్రియన్‌, జూడో, రోయింగ్‌ , వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగం నుంచి ఒక్కొక్కరు భారత్‌ తరఫున విశ్వ క్రీడల్లో పాల్గొననున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత్‌ నుంచి 119 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. అత్యధికంగా ఏడు పతకాలతో తిరిగి వచ్చారు. ఇందులో జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా పసిడి పతకం అత్యంత గొప్ప జ్ఞాపకం.

చదవండి: Paris Olympics:ఆంధ్రా టు పారిస్‌.. ఆడుదాం ఒలింపిక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement