'నేను రిషబ్‌ పంత్‌.. కొత్త ఉత్సాహంతో ఉన్నా' | Viral Video Of Rishab Pant Gymnastics Before Second Test | Sakshi
Sakshi News home page

'నేను రిషబ్‌ పంత్‌.. కొత్త ఉత్సాహంతో ఉన్నా'

Published Sat, Feb 13 2021 10:18 AM | Last Updated on Sat, Feb 13 2021 1:04 PM

Viral Video Of Rishab Pant Gymnastics Before Second Test - Sakshi

చెన్నై: టీమిండియా యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ యమ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌ తర్వాత పంత్‌ తన జోష్‌ను మరింత పెంచాడు. టీమిండియా తొలి టెస్టులో​ఓటమి పాలైనా పంత్‌ దూకుడైన ఇన్నింగ్స్‌ ఆకట్టుకుంది. 97 పరుగులు చేసిన పంత్‌ మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ కావడం నిరాశపరిచింది. తాజాగా పంత్‌ జిమ్‌సెషన్‌కు సంబంధించిన వీడియో రిలీజ్‌ చేశాడు. ఆ వీడియోలో పంత్‌ తీవ్రమైన కసరత్తులు చేసినట్లుగా కనిపించింది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు మరింత ఉత్సాహంగా సన్నద్దమవుతున్నట్లు సూచిక పంపాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

'నేను మీ రిషబ్‌ పంత్‌.. కొత్త ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నా' అంటూ క్యాప్షన​ జత చేశాడు. కాగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఓలి బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ .. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 8ఓవర్లలో వికెట్‌ నష్టానికి 29 పరుగులు చేసింది. రోహిత్‌ 23, పుజారా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: పాక్‌ వికెట్‌ కీపర్‌ ఖాతాలో అరుదైన రికార్డులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement