
లండన్: టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ కరోనా నుంచి పూర్తిగా కోలుకొని టీమిండియా జట్టుతో కలిశాడు. కాగా ప్రస్తుతం టీమిండియా డర్హమ్‌లోని బయోబబూల్‌లో ఉంటూ కౌంటీ ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రిషబ్ పంత్ జట్టుతో కలిసినట్లు బీసీసీఐ తమ ట్విటర్‌లో పేర్కొంది. హలో రిషబ్ పంత్.. నిన్ను జట్టుతో చూడడం ఆనందంగా ఉంది.. అంటూ ట్వీట్ చేసింది. కాగా పంత్‌కు డెల్టా వేరియంట్ లక్షణాలు కనిపించడం.. అతనితో పాటు సహాయక సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది.
దీంతో పంత్‌తో పాటు మిగతావారిని లండన్‌లో ఐసోలేషన్‌కు తరలించారు.దాదాపు పది రోజుల ఐసోలేషన్ అనంతరం తాజాగా రెండు రోజుల క్రితం పంత్‌కు నెగెటివ్ అని తేలింది. దీంతో టీమిండియాతో కలిసేందుకు మార్గం సుగమమైంది.ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యా్చ్ అనంతరం రిషబ్ పంత్ ఇటీవలే యూరోకప్ 2020 మ్యాచ్‌కు హాజరయ్యాడు.మ్యాచ్‌కు ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ఉండడం.. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించకపోవడంతోనే పంత్‌కు కరోనా సోకిందంటూ వార్తలు వచ్చాయి. కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి మొదలుకానుంది.
Hello @RishabhPant17, great to have you back 😀#TeamIndia pic.twitter.com/aHYcRfhsLy
— BCCI (@BCCI) July 21, 2021