ప్రాక్టీస్‌కు కొత్త ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన పంత్‌ | Watch Rishabh Pant Introduces New Friend Spidey In Practice Session | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్‌కు కొత్త ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన పంత్‌

Published Tue, Feb 23 2021 4:33 PM | Last Updated on Tue, Feb 23 2021 5:29 PM

Watch Rishabh Pant Introduces New Friend Spidey In Practice Session - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ తన కొత్త ఫ్రెండ్‌తో కలిసి మూడో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. దీనిలో భాగంగా తన ఫ్రెండ్‌తో కలిసి నెట్‌ సెషన్‌లో బిజీగా గడిపాడు. ఇంతకీ రిషబ్‌ కొత్త ఫ్రెండ్‌ ఎవరో తెలుసా.. స్పైడర్‌ రూపంలో ఉన్న డ్రోన్‌. ఆసీస్‌ టూర్‌లో పంత్‌ స్పైడర్‌మ్యాన్‌గా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సుందర్‌తో కలిసి జిమ్‌ సెషన్‌లో పంత్‌ స్పైడర్‌మ్యాన్‌లా మిమిక్రీ చేసిన వీడియో అప్పట్లో బాగా వైరల్‌ అయింది.

తాజాగా 23 ఏళ్ల పంత్‌ మరోసారి గ్రౌండ్‌లో డ్రోన్‌ స్పైడర్‌తో ఆడుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'ఈరోజు స్టంప్స్‌ వెనుక చాలాసేపు ప్రాక్టీస్‌ చేశాను.. అందుకే కాసేపు ప్రశాంతత కోసం కొత్త ఫ్రెండ్‌తో ఆడుకున్నా.. ఇంతకీ నా ఫ్రెండ్‌ పేరు ఏంటో తెలుసా.. స్పైడీ.. మీట్‌ మై ఫ్రెండ్' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.  ఆసీస్‌ టూర్‌లో వృద్దిమాన్‌ సాహా స్థానంలో​ జట్టులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ అప్పటినుంచి తన ఆటలో దూకుడును ప్రదర్శిస్తూ వచ్చాడు. ఆసీస్‌ పర్యటనలో మూడు, నాలుగు టెస్టులతో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లోనూ పంత్ అదే జోరును కొనసాగించాడు. కాగా ఇంగ్లండ్‌, టీమిండియా మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా డే నైట్‌ పద్దతిలో జరగనుంది. నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్‌​ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి.
చదవండి: 'గేల్‌.. నీలాగా నాకు కండలు లేవు'
బంతి దొరకడమే ఆలస్యం.. సూపర్‌ స్టంపింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement