చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఫాలోఆన్ దిశగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (33), అశ్విన్ (8) ఉన్నారు. ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో రోజు ఆటలో అశ్విన్, సుందర్‌లు కనీసం రెండు సెషన్ల పాటు ఇంగ్లండ్ బౌలర్లను నిలువరిస్తేనే ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.
ఒక దశలో 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ను పంత్ (91), పుజారా (73) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. ముఖ్యంగా పంత్ టీ20 ఇన్నింగ్స్‌ను తలపిస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈసారి సెంచరీ చేసేలా కనిపించినా 91 పరుగులు దగ్గర పంత్ ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కొత్త స్పిన్నర్ డోమ్ బెస్ 4, జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment