
బంగారు పతకంతో దీపా కర్మాకర్( మధ్యలో )
న్యూఢిల్లీ : జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో బంగారు పతకం సాధించారు. ఆదివారం టర్కీలోని మెర్సిన్ వేదికగా జరిగిన ఫిజ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో ఆమె బంగారు పతకం గెలుచుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్ విభాగంలో దీప నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా రెండు సంవత్సరాలు జిమ్నాస్టిక్స్‌కు దూరంగా ఉన్న ఆమె పట్టుదలతో ఈ విజయం సాధించారు.
భారత్ గర్విస్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ
దీపా కర్మాకర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. ఫిజ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో బంగారు పతకం సాధించటం పట్ల భారత దేశం గర్విస్తోందని అన్నారు. ఈ విజయం దీపా పట్టుదలకు, ఓటమి ఒప్పుకోని ధైర్యానికి చిహ్నంగా ఆయన అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment