సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో జిమ్నాస్టిక్స్ సందడి మొదలైంది. సరూర్‌నగర్ స్టేడియంలో జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరిగే ఈ టోర్నమెంట్‌లో దేశంలోని 9 రాష్ట్రాలకు చెందిన 100 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు హూప్, బాల్, క్లబ్స్, రిబ్బన్ ఈవెంట్‌లలో వ్యక్తిగత, ఆల్‌రౌండ్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు కౌశిక్ బిడివాలా, టోర్నమెంట్ డైరెక్టర్ శశి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు, సలహాదారు సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నేతలు అరవింద్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment