లక్ష్మి, వందనలకు చెరో 3 పతకాలు
జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన జిమ్నాస్ట్‌లు లక్ష్మి, వందన ఆకట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఆనంద్‌నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ పోటీల్లో వీరిద్దరూ చెరో 3 పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్–16 బాలికల కేటగిరీలో ఆదివారం జరిగిన పోటీల్లో ప్రతిభ కాలేజికి చెందిన వి. లక్ష్మి... ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్, బీమ్ విభాగాల్లో స్వర్ణాలతో పాటు వాల్ట్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఇదే వయోవిభాగంలో నేచర్ కాలేజి విద్యార్థి వందన... ఫ్లోర్, బీమ్, వాల్ట్ ఈవెంట్‌లలో రెండో స్థానంలో నిలిచి మూడు రజత పతకాలను సొంతం చేసుకుంది.
మరోవైపు ఫ్లోర్, బీమ్ ఈవెంట్‌లలో మూడో స్థానంలో నిలిచిన ముస్కాన్... వాల్ట్ ఈవెంట్‌లో స్వర్ణంతో మెరిసింది. బాలుర విభాగంలో జరిగిన ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్‌లలో సాయిప్రసాద్, రిత్విక్, ఉమేశ్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి తలో రెండు పతకాలను దక్కించుకున్నారు. పోటీల ముగింపు కార్యక్రమంలో హెచ్‌డీజీఏ అధ్యక్షులు మన్వీందర్ మిశ్రా, కార్యదర్శి సోమేశ్వర్, రంగారెడ్డి జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు
అండర్–6 ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. తన్వి, 2. ఎన్. భవ్య, 3. కె. శాన్వి. అండర్–8 ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. ఎం. సిరిరెడ్డి, 2. వృందశ్రీ,, 3. మెహర్; బీమ్: 1. సిరిరెడ్డి, 2. భవ్య, 3. తన్వి రెడ్డి. అండర్–10, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. నిషిక, 2. వేదిక, 3. వేద; బీమ్: 1. నిషిక, 2. వేదిక, 3. ధన్య ప్రసాద్; వాల్ట్: 1. నిషిక, 2. వేదిక, 3. ప్రణవి. అండర్–12 ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. చిన్మయి, 2. గీతా రాజ్, 3. ఖుషి; బీమ్: 1. చిన్మయి, 2. ప్రియాల్, 3. మేఘ; వాల్ట్: 1. చిన్మయి, 2. గీతారాజ్ 3. ప్రియాల్. అండర్–14 ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. సొహిని, 2. దివ్య సింగ్, 3. ఆమని; బీమ్: 1. ఆమని, 2. సొహిని; వాల్ట్: 1. సొహిని, 2. ఆమని, 3. అమేషా అగర్వాల్.
బాలురు: అండర్–6 ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. చక్రీనాథ్, 2. తనద్ కంఠ, 3. దర్శన్. అండర్–8 ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. అద్వైత్, 2. కౌశిక్, 3. సాయి హర్షిత్. అండర్–10 ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. నీలకంఠ, 2. ఆకాశ్, 3. ధీరజ్; వాల్ట్: 1. నీలకంఠ, 2. ధీరజ్, 3. అక్షయ్. అండర్–12 ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. విజిత్, 2. శివ్‌లాల్, 3. దీపక్ గౌడ్; వాల్ట్: 1. విజిత్, 2. శివ్‌లాల్, 3. దీపక్ గౌడ్. అండర్–14 ఫ్లోర్ ఎక్సర్‌సైజ్: 1. వెంకట్‌సాయి, 2. సతీశ్, 3. పూజిత్; వాల్ట్: 1. వెంకట్‌సాయి, 2. ప్రవీణ్, 3. పూజిత్.