ఇవి మీకు తెలుసా?
► ఐస్‌ల్యాండ్‌లో క్రిస్మస్ పండగ కానుకలుగా పుస్తకాలను ఒకరికి ఒకరు పంచుకునే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అంటారు. ఇతర దేశాలతో పోల్చితే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రచురణ కర్తలు అత్యధిక సంఖ్యలో పుస్తకాలు అమ్ముతారు కాబట్టి దీనికి ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అని పేరు వచ్చింది.
►‘జిమ్నాస్టిక్స్’ అనేది పురాతన గ్రీకు పదం ‘జిమ్నాజీన్’ నుంచి పుట్టింది. దీని అర్థం నగ్నంగా వ్యాయామం చేయడం. యువకులకు యుద్ధవిద్యలలో శిక్షణ ఇచ్చే విధానం ‘జిమ్నాజీన్’ కాలక్రమంలో ఎన్నో మార్పులకు లోనైంది.
► ‘బే క్యాట్’ అనేది అత్యంత అరుదైన పిల్లి జాతి. ఇవి ఆగ్నేయ ఆసియాలోని బోర్నియో ద్వీపంలో మాత్రమే నివసిస్తాయి. అటవీ నిర్మూలన వల్ల వీటి సంఖ్య విపరీతంగా తగ్గి ప్రమాదపు అంచున ఉన్నాయి. అంతరించి పోతున్న జాతుల జాబితాలో వీటిని చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment