
ప్రతీకాత్మక చిత్రం
శివమొగ్గ(బెంగళూరు): లక్షల్లో పేరుకు పోయిన అప్పులు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. శివమొగ్గ తాలూకా కుంచెనహళ్లి గ్రామానికి చెందిన లోకేశ్ నాయక్ (38), సుమిత్ర దంపతులు. లోకేశ్ పంటల కోసం సహకార బ్యాంకుతో పాటు ఇతరుల వద్ద రూ. లక్షల్లో అప్పులు తెచ్చాడు. పంట చేతికి రాకపోవడంతో వడ్డీలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో దంపతులు తరచూ గొడవలు పడేవారు. శనివారం రాత్రి కూడా ఇద్దరు గొడవపడ్డారు. క్షణికావేశంలో లోకేశ్ భార్యపై వేటకొడవలితో తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: హోలీ వేడుకలు.. ఫ్రెండ్ భార్యపై రంగు చల్లిన దోస్త్.. ఇంతలో భర్త వచ్చి.. )
మరో ఘటనలో..
గుర్తు తెలియని వాహనం ఢీకొని.. : శివమొగ్గ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మానసిక రోగి రోడ్డుపై శవంగా పడి ఉన్న ఘటన సాగర నగరంలో చోటు చేసుకుంది. తాలూకాలోని గొరగద్దె గ్రామానికి చెందిన బంగారప్ప (35) ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment