
సాక్షి, బెంగళూరు: నాగ మంగళ తాలూకా గంగవాడి గ్రామంలో బుధవారం ఘోరం చోటు చేసుకుంది. ఏడాదిన్నర కూతురు సిరిని చంపి, రఘు, (28) తనుశ్రీ(23) అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తనిశ్రీ మండ్యకు చెందిన రఘుని మూడేళ్ళ కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది.
మండ్యలో నివసిస్తున్న వీరు వారం కిందట గంగావాడి గ్రామానికి వచ్చారు. బుధవారం మధ్యాహ్నం వరకు పాపతో సంతోషంగా గడిపారు.తనుశ్రీ తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లిన సమయంలో పాపను చంపి చేసి తరువాత ఊరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. తమ మరణానికి ఎవరూ కారణం కాదని డెత్ నోటు రాసి పెట్టారు. నాగ మంగళ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment