
సాక్షి బెంగళూరు: చికెన్ కబాబ్ (చికెన్ పకోడా) బాగా లేదన్న వివాదం భర్త ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటన బెంగళూరు బన్నేరుఘట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అరెకెరె లేఔట్‌లో గత గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. సురేశ్ (48) బొమ్మనహళ్లిలోని గార్మెంట్స్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. చికెన్ కబాబ్ చేయాలని భార్య షాలిని (42)ని అడగగా, ఆమె చేసి పెట్టింది.
అయితే రుచిగా లేదని అగ్రహోదగ్రుడై ఆమెను చావబాదాడు. కత్తితో తల, చేతులపై దాడిచేసి పరారయ్యాడు. షాలిని కేకలు విని ఇరుగుపొరుగు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు చేరుకుని షాలిని వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు. ఇక పరారీలో ఉన్న సురేశ్ ఇంటికి సమీపంలో నిర్మానుష్య ఖాళీ ప్రాంతంలో చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి: మృగంలా మారిన భర్త.. విడాకులు అడిగిన భార్యకు 30 కత్తిపోట్లు.. ‘మైండ్ బ్లాంక్ అయిందని..’
Comments
Please login to add a commentAdd a comment