చంద్రబాబు ఇలాకాలో మహిళపై దాష్టీకం | TDP supporters allegedly strip, thrash woman in kuppam | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇలాకాలో మహిళపై దాష్టీకం

Jan 18 2018 9:50 AM | Updated on Mar 22 2024 11:01 AM

రాష్ట్రంలో మహిళలపై తెలుగుదేశం నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. ఇటీవల విశాఖ జిల్లా పెందుర్తిలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను హింసించిన ఘటన మరువక ముందే మరోసారి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అలాంటి కీచకపర్వం పునరావృతమైంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులైన భార్యాభర్తలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందినవారు దాడి చేశారు. మహిళను వివస్త్రను చేసి కిరాతకంగా ప్రవర్తించారు.

ఈ దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన భార్యాభర్తలకు అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో కొంతకాలంగా గొడవలున్నాయి. ఇదే విషయాన్ని ఉమ దంపతులు ఇటీవలి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఆ కుటుంబం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి  చెందిందంటూ ఆ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement