సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయ ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయం గెలిచిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు గ్రామాలకు హీరో అయితే 13 జిల్లాలకు విలన్ అని మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన లోక్‌ష్‌ను మండలిలోకి పంపారని, లోకేష్ పదవి పోతుందని చంద్రబాబు బాధపడుతున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు చైర్మన్‌ను ప్రభావితం చేశారు
శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను శాసన మండలిలో అడ్డుకుని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం బిల్లు, ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్లును శాసన మండలి అడ్డుకుందని, తాజాగా పాలన వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను ప్రభావితం చేశారని, టీడీపీకి శాసన మండలిలో మెజారిటీ ఉందని రాజకీయంగా అడ్డుకున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో శాసన మండలి ఉందని గుర్తు చేశారు.
మండలి రద్దును ప్రతిపాదిస్తే సమర్థిస్తానని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.శాసనమండలి అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాజకీయ దురుద్దేశంలో మండలిలో బిల్లులను అడ్డుకున్నారని, ప్రజా సంక్షేమం కోసం పనిచేయని మండలికి ప్రజాధనం వెచ్చించడం వృథా అని వ్యాఖ్యానించారు. పెద్ద మనసులేని వ్యక్తులు పెద్దలు ఎలా అవుతారని చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment