decentralisation of power
-
బిగ్ క్వశ్చన్ : వికేంద్రీకరణకే జై కొడుతున్న ఏపీ ప్రజలు
-
ఉత్తరాంధ్ర అభివృద్ధితోనే వలసలు ఆగిపోతాయి : మేధావులు
-
రాష్ట్రమంతా వికేంద్రీకరణను స్వాగతిస్తోంది
-
బహుజనుల బాగుకే మూడు రాజధానులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 9 నెలలుగా రాష్ట్రాభివృద్ధి కోసం సాహసోపేతమైన చర్యలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, శాసన మండలి రద్దు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం, బహుళ రాజధానుల ఏర్పాటు లాంటివన్నీ దమ్మున్న చర్యలు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవే. అధికారంలో ఉన్న పార్టీ ఏది చేసినా దాన్ని వ్యతిరేకించి తీరాలన్న ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ, ఏపీ శాసన మండలి రద్దుతోపాటు బహుళ రాజధానులనూ వ్యతిరేకిస్తోంది. అందరి ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చర్యను వ్యతిరేకిస్తూ తమ బాధను అందరి బాధగా చిత్రిస్తూ నానా యాగీ చేస్తున్నారు. ప్రధానమైన అసెంబ్లీ భవనాలు ఇతరాలు అన్నీ అమరావతిలో ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకే చోట ఉండాలనడం స్వార్థం కదా? ఓ బలమైన సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఆ సమస్యతో సంబంధం లేని చిన్న రైతులను, బహుజనులనూ వాడుకోవడం సరైందేనా? ఇప్పటికే చాలా రంగాల్లో అభివృద్ధి చెందిన వర్గం ప్రబలంగా ఉన్న ఈ ప్రాంతంలోనే రాజధాని మొత్తంగా ఉండాలనడం ఏం న్యాయం? రాజధాని వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి మూడు ప్రాంతాల బహుజన వర్గాలు బాగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో విశాఖపట్నం, కర్నూలు నగరాలు కూడా మహానగరాలుగా అభివృద్ధి చెంది ఏపీ మూడు మహానగరాలున్న రాష్ట్రంగా అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతులను సాధిస్తుంది. ఉత్తరాంధ్రలో ఆదివాసీల జనాభా ఎక్కువ. బహుజన కులాల వెనుకబాటు తనమూ ఉంది. రాయలసీమలోనూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ రాజధానులను ఏర్పరచడం ద్వారా కచ్చితంగా వీటికి ప్రాధాన్యత పెరుగుతుంది. సినిమా పరిశ్రమకు అనువైన స్థలం వైజాగ్. రాజధాని ఇక్కడుంటే భవిష్యత్తులో ఇక్కడికి సినిమా పరిశ్రమ రావడం వల్ల వేలాది మంది లబ్ధి పొందుతారు. క్రమక్రమంగా ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధి చెందే అవకాశముంది. అలాగే ప్రకృతి శాపంతో నీట కరువు, అనేక చారిత్రక కారణాల వల్ల ఫ్యాక్షనిజం లాంటి వాటితో వెనుకబడున్న రాయలసీమ కూడా న్యాయ రాజధాని కర్నూలుకు రావడంవల్ల అభివృద్ధి చెందుతుంది. న్యాయంగా తనకు రావాల్సిన నిధులు, నీళ్ళు, విద్యాలయాలు, పరిశ్రమలు పొంది ఉపాధి అవకాశాలు మెరుగవడం వల్ల.. రాళ్ళ సీమగా మారిన ‘రాయల సీమ’ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ఇక్కడి బహుజనులు వివిధ అవకాశాలు పొంది అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తారు. తెలుగు రాష్ట్రాలనేలిన పాలకులందరికంటే కూడా మేలయిన రీతిలో బహుజనుల కోసం అనేక పనులు చేస్తున్న జగన్మోహన్రెడ్డి బహుళ రాజధానులను ఏర్పర్చడం ఆంధ్రప్రదేశ్ సమతుల, సర్వతోముఖాభివృద్ధి కోసమే. ఏపీ ప్రజలకు ఒక్క మహానగరమే కావాలో, మూడు మహానగరాలు కావాలో, 29 గ్రామాల బాగోగులే కావాలో, 5 కోట్ల మంది అభివృద్ధి కావాలో, పిడికెడు మంది బిలియనీర్లు కావాలో, కోట్లమంది బహుజనులు మధ్య తరగతికైనా ఎదగాలో ఆలోచించండి. జగత్ ప్రసిద్ధ రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మాణం కానట్లే.. విశాఖపట్టణమైనా, అమరావతైనా, కర్నూలైనా మహానగరాలుగా అభివృద్ధి చెందడానికి ఒకటి, రెండు దశాబ్దాల కాలమైనా పడుతుంది. సత్సంకల్పంతో, బహుజనాభివృద్ధి ధ్యేయంగా ఈ పనిని ఆరంభిం చిన వైఎస్ జగన్‌కు చేయూతనివ్వండి. కాలుపట్టి వెనుకకు లాగితే అది అతిపెద్ద చారిత్రక తప్పిదమే అవుతుంది. వ్యాసకర్త: డా. కాలువ మల్లయ్య, ప్రముఖ సామాజిక విశ్లేషకులు, మొబైల్ : 91829 18567 -
పరిపాలన వికేంద్రీకరణను ప్రజలు స్వాగతిస్తున్నారు
-
త్వరలో టీడీపీలో చీలిక: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి : టీడీపీలో త్వరలో చీలిక రాబోతుందని, ఆ ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వయసు మీరిన నేతలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ చీలిపోతుందనే ఆందోళనతో ఏమి మాట్లాడుతున్నారో చంద్రబాబుకు అర్ధం కావడంలేదని, ఎల్లో మీడియా కూడా చంద్రబాబును మోసి మోసి అలిసిపోయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి చంద్రబాబుకు లేదని అన్నారు. పోలీసుల మీద ఆధారపడి జీవించేది చంద్రబాబు.. జెడ్ ప్లస్ భద్రత లేకుండా జనాల్లోకి ఆయన వెళ్లగలరా అంటూ ప్రశ్నించారు. వికేంద్రీకరణ ఎందుకు వద్దో ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. రాయలసీమలో రౌడీలు ఉన్నారని విమర్శలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు కీయా పోతుందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధపు వార్తలు రాయించి సంతోషం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు చెప్పినట్లు రాసే పత్రికలు ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నాయని అన్నారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో రాద్దాంతం చేస్తారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ‘చంద్రబాబు బతుకు గ్రాఫిక్ బతుకు.. సీఎం వైఎస్ జగన్ చేసే మంచి పనులు చూడలేక బురద జల్లుతున్నారు.. బాబు ఒక గూండాలా మాట్లాడుతున్నారు. ఆయనకు దమ్ముంటే తనతో చర్చకు రావాలి, వైఎస్ జగన్మోహన్రెడ్డి అవసరం లేదు. వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని చైర్మన్ స్వయంగా చెప్పారు. రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమ వెళ్లదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కట్టిన గొల్లపల్లి ప్రాజెక్టు వల్లనే కీయా పరిశ్రమ అనంతపురంకు వచ్చింది. చంద్రబాబునాయుడు కియాపై తప్పుడు కథనాలు రాయించారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయే కానీ పోయేవి ఉండవు. చంద్రబాబును చూసి సిగ్గు పడుతున్నా. ఆయనకు దమ్ముంటే రైతులను ఎవరు మోసం చేస్తున్నారో తమతో చర్చకు తుళ్లూరుకు రావాలి. వైఎస్సార్ సీపీ తరపున నేను వస్తా. వికేంద్రీకరణను ప్రజలు స్వాగతిస్తున్నారు. చంద్రబాబు ఎందుకు వద్దంటున్నారో చెప్పగలరా. గంటలు గంటలు లెక్చర్ ఇవ్వడం కాదు, ప్రజలకు మేలు చేయాలనే బుద్ది ఉండాలి. చంద్రబాబుకు నగరాలు నిర్మించే సామర్థ్యం ఉంటే గత ఐదేళ్లలో ఎందుకు చెయ్యలేదు. చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్ తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. టీడీపీ హయాంలో 3 లక్షల కోట్లు దిగమింగారు. చంద్రబాబు రాజకీయాలను దిగజార్చారు’’ అంటూ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: బినామీల కోసమే చంద్రబాబు ఆరాటం -
త్వరలో టీడీపీలో చీలిక: శ్రీకాంత్ రెడ్డి
-
బాలకృష్ణ గోబ్యాక్ అంటూ నినాదాలు
-
బాలకృష్ణకు సెగ.. ‘గోబ్యాక్’ నినాదాలు
సాక్షి, హిందూపురం: సొంత నియోజకవర్గంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజాసంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ వారు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో హైకోర్టును అడ్డుకుంటున్న బాలయ్య.. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ గోబ్యాక్ అంటూ నినదించారు. -
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడిచారు
-
‘చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలి’
సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్య విలువలు పెంచే విధంగా శాసనసభలో చర్చాలకు రావాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ శాసన సభ్యులు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. శాసన సభలో చర్చకు దూరంగా ఉండటం, శాసన సభ ఆమోదం తెలిపిన బిల్లులు అడ్డుకోవడం, జాప్యం చేయడంపై ధైర్యంగా చర్చకు రావాలని ప్రతిపక్షాన్ని డిమాండ్ చేశారు. నాడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడిన మాటలు, దివంగత ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు మాట్లాడిన మాటల గురించి చర్చించుకుందామన్నారు. ఆంగ్లభాషా బిల్లుపై చర్చకు రాకుండా కాలయాపన చేశారని, నేడు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడిచినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయరని స్పష్టం చేశారు, సీఎం వైఎస్ జగన్ ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తారన్నారు. దేశంలోనే ఒక ముఖ్యమంత్రి కుమారుడు సొంతంగా పార్టీ పెట్టి సీఎంగా నిలిచిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని ప్రశంసించారు. -
‘పెద్ద మనసు లేని వ్యక్తులు పెద్దలు ఎలా అవుతారు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజకీయ ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయం గెలిచిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు గ్రామాలకు హీరో అయితే 13 జిల్లాలకు విలన్ అని మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన లోక్‌ష్‌ను మండలిలోకి పంపారని, లోకేష్ పదవి పోతుందని చంద్రబాబు బాధపడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చైర్మన్‌ను ప్రభావితం చేశారు శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను శాసన మండలిలో అడ్డుకుని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం బిల్లు, ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్లును శాసన మండలి అడ్డుకుందని, తాజాగా పాలన వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను ప్రభావితం చేశారని, టీడీపీకి శాసన మండలిలో మెజారిటీ ఉందని రాజకీయంగా అడ్డుకున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో శాసన మండలి ఉందని గుర్తు చేశారు. మండలి రద్దును ప్రతిపాదిస్తే సమర్థిస్తానని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.శాసనమండలి అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాజకీయ దురుద్దేశంలో మండలిలో బిల్లులను అడ్డుకున్నారని, ప్రజా సంక్షేమం కోసం పనిచేయని మండలికి ప్రజాధనం వెచ్చించడం వృథా అని వ్యాఖ్యానించారు. పెద్ద మనసులేని వ్యక్తులు పెద్దలు ఎలా అవుతారని చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
సర్కారు సామాన్యుని వరిస్తేనే..!
సమకాలీనం జల్లాల పెంపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో కొంత నిజమున్నా, ప్రక్రియను నిలిపివేయదగినంత పసలేదు. ఏకపక్షంగా తప్ప శాస్త్రీయంగా జరగలేదని, పారదర్శకత లోపించిం దని, ప్రత్యర్థుల్ని దెబ్బతీసే రాజకీయ ఎత్తుగడలతో పాలకపక్షం జరిపించిందని విమర్శిస్తున్నారు. ఒక న్యాయ కమిషన్ వేసైనా స్వతంత్రంగా జరిపించి ఉండాల్సిందనేది వాదన. జిల్లా విభజనకు జనాభానో, నైసర్గిక స్వరూపాన్నో, సంస్కృతినో, గ్రామీణ-పట్టణ స్వభా వాన్నో... దేన్నీ ప్రామాణికం చేసుకోకుండా అడ్డగోలుగా జరిపించారనేది విపక్షాల విమర్శ. నిజమైన పరిపాలనా వికేంద్రీకరణకు సమయం ఆసన్నమైంది. అంతి మంగా ప్రజాప్రయోజనాలే లక్ష్యమై, నికర ఫలితాలు వారికి లభించేలా జరగాలి. ఇది ప్రభుత్వాలు స్వచ్ఛందంగా చేస్తే సరేసరి! చేయకపోతే పౌరులే పూనిక వహించి బలవంతంగానైనా జరిపించాల్సి వస్తుందనేది రెండో అభిప్రాయానికి తావులేని సత్యం. ఎప్పటికిది సాకారమౌతుందన్నది ప్రభుత్వ నిర్వాకాలపైన, అంతకు మించి పౌరసమాజం చేతనపైనా ఆధారపడి ఉంది. ప్రభుత్వాలు తీసుకొస్తున్న పాలనా మార్పులు అంతిమంగా ప్రజలకేమైనా మేలు చేస్తాయా? అన్నది ఇప్పటికిప్పుడు సమాధానం లభించని వేయి రూకల ప్రశ్న! మేలు జరిపించే క్రమంలో జిల్లాల విభజన ఓ బలమైన ముందడుగనే అభిప్రాయాన్ని అత్యధికులు అంగీకరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదొక చర్చనీయాంశం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో కొత్త జిల్లాలేర్పడ్డాయి, అందులో భాగంగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు పెరి గాయి. మరి ఆంధ్రప్రదేశ్‌లోనూ జిల్లాల విభజన చేస్తారా? అన్నది తరచూ ప్రస్తావనకు వస్తోంది. వికేంద్రీకరణ, జిల్లాల విభజన సంగతలా ఉంచితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఒక్కొక్క అడుగూ అధికార కేంద్రీ కరణవైపే సాగుతోంది. తానూ, తన తనయుడే కేంద్రబిందువులుగా అధి కారమంతా గుప్పిట పట్టే చర్యలు ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కొట్టొచ్చి నట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణ సాకారమై తొలి ప్రభుత్వం ఏర్పడ్డ నుంచీ క్రమంగా ఇటువంటి విమర్శ నెదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక్కదెబ్బతో విమర్శకుల నోళ్లు మూయించారని పాలకపక్షం భావన. కొత్త జిల్లాల ఏర్పాటు దేశాన్నే అబ్బురపరచిన గొప్ప పాలనా సంస్కరణ అని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు. అది నిజంగా పాలనా సంస్కరణా? పాలనలో భాగంగా జరిగిన సంస్థాగత మార్పా? అన్న మీమాంస రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చిన్న జిల్లాలతో పాలన పౌరులకు మరింత చేరువ వుతుందనడంలో సందేహం లేదు. కానీ, అదే ఇప్పుడున్న ప్రధాన సమస్యల న్నిటికి పరిష్కారమౌతుందా? దీనికి తోడు ఇంకేమైనా జరగాలా? రాజకీయ వ్యవస్థ-అధికార యంత్రాంగంలో బాధ్యత, జవాబుదారీతనం పెరక్కుండా జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఎన్నొస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? ఆ జవాబుదారీతనం పెరగడానికి ఏం చేస్తారు? అన్న ప్రశ్నలకు నిర్దిష్టంగా సమాధానం లేదు. వికేంద్రీకరణే బాబుకు పొసగదేమో! పాలనా సంస్కరణల్లో వికేంద్రీకరణ కీలకాంశమే! కానీ, అసలైన వికేంద్రీకరణ స్ఫూర్తి మూడంచెల పాలనా వ్యవస్థలో ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా చట్టబద్ధం చేసుకున్నట్టు ‘స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు’తో జరిగే పాలనా వికేంద్రీకరణలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారు. స్థానిక సంస్థలు బలోపేతమవుతాయి. గ్రామం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడతాయి. ఇప్పుడు తెలంగాణలో జరిగింది జిల్లాల్ని విభజించి చిన్న జిల్లాలు చేయడమే! మిగతా పాలనావ్యవస్థ అంతా యథాతథం. ఈపాటి చొరవ కూడా లేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారాన్ని క్రమంగా కేంద్రీకృతం చేస్తున్నారు. 1996-2004 నాటి ఆయన పాలననే మించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారు. రాజ్యాంగ, చట్ట, సంప్రదాయకంగా వస్తున్న కొన్ని పాలనా ప్రక్రియల్ని ఒకటొకటిగా ధ్వంసం చేస్తున్నారు. ఏదీ ఎవర్నీ చేసుకోనివ్వరు, అన్నిటికీ తానే అంటారు. ఇద్దరు ముగ్గురు మినహా మంత్రి వర్గమంతా డమ్మీ! మరోవైపు తనయుడు లోకేశ్‌బాబును రాజ్యాంగేతరశక్తిగా బలోపేతం చేస్తున్నారు. మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కర్షక పరిషత్ హోదాతో తాను వ్యవహరించినటే,్ట ఆ వారసత్వాన్ని బాబు ఇప్పుడు లోకేశ్బాబుతో కొనసాగిస్తున్నారు. చినరాజప్ప వంటి సీనియర్ నాయకుడి తోనూ లోకేశ్ అమర్యాదగా వ్యవహరించడానికి ఇదే కారణం! కొత్త రాష్ట్రం ఎదుగుదలకు దోహదపడే... విద్యుత్తు, పరిశ్రమలు, మౌలికసదుపాయాలు- పెట్టుబడులు (ఐఅండ్ఐ), టూరిజం, శాంతిభద్రతలు వంటి కీలక శాఖలన్నీ సీఎం తన వద్దే ఉంచుకున్నారు. మిగతా అన్ని ముఖ్య శాఖల సమీక్షలూ తానే నిర్వహిస్తారు. సమీక్షల తాకిడి ఎంత అధికమంటే, ఫలితాల సాధన సంగ తలా ఉంచితే, రెండు సమీక్షల మధ్య ఉన్నతాధికారులకు ఊపిరి తీసుకునే వెసులుబాటు కూడా ఇవ్వరు. ఆర్థికశాఖను గురువారం సమీక్షించారు. 5 రోజుల వ్యవధితో ఈ నెల 18న, మరో 3 రోజుల వ్యవధితో 21న మళ్లీ సమీక్షిస్తారట! మధ్య రోజుల్లో ఈ సమీక్షలకు నివేదికలు సిద్ధం చేయడంలోనే అధికారులు తలమునకలవుతారు. ఇక ఆయా సమీక్షల్లో నిర్ణయించింది అమలు చేసేదెప్పుడు? నిర్ణయాల మేర పనులు జరపాల్సిన అధికారులు, గంటల పాటు ఏకపక్ష ప్రసంగాలతో సాగే సమీక్ష ముగిస్తే చాలు... ‘హమ్మయ్య!’ అని ఊపిరి తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేసే పోలీసు భద్రతా వ్యవస్థకు కూడా ‘నేనే చీఫ్ కమాండర్’ అంటారు ముఖ్యమంత్రి. కాంట్రాక్టు పనుల బిల్లుల చెల్లింపులు ఆన్లైన్లో అని బయట ప్రకటిస్తారు. కానీ, లోలోపల జరిగేది వేరు. తన జోక్యం లేకుండా ఏదీ ఆమోదం పొందదు. బిల్లులు ఓకే అవ్వాలంటే తనను కలవాల్సిందే! మధ్యలో ఉన్న వ్యవస్థలన్నింటినీ త్రోసిరాజని, అట్టడుగు స్థాయి ఎమ్మార్వోలతో, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి తానే మాట్లాడుతారు. రెయిన్‌గన్ ఉపయోగాన్నీ తానే పురమాయిస్తారు. కానీ, జరిగే ఏ తప్పిదానికీ స్వయంగా బాధ్యత తీసుకోరు, జవాబుదారితనం చూపరు. ఇదీ వరస! పౌరకేంద్రక పాలనే ముఖ్యం రాజకీయ, అధికార వ్యవస్థ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాల్ని సమర్థంగా తీరిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అభివృద్ధి, సంక్షేమం, నియంత్రణ అన్న మూడు రకాల ప్రధాన బాధ్యతలు నిర్వహించే ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ జనహితం అన్న దృష్టి కోణంలోనే పనిచేయాలి. చట్టం నిర్దేశించే నిబంధనలకు లోబడి వ్యవహారాలన్నీ అవాంతరాలు రాకుండా, రాజకీయ ప్రమేయాలు-జోక్యాలు అవసరం లేకుండా జరిగిపోయే కార్యా చరణ నిత్యం అవసరం. ఇందుకు ఏర్పాటయ్యే వ్యవస్థ నిర్మాణం, విధానాలు, నిర్ణయాలు, పనితీరు అన్నీ ఈ దిశలోనే ఉండాలి. అట్టడుగు స్థాయిలోనూ పౌరుల పనులు సవ్యంగా జరగాలి. వారికి ప్రభుత్వ సేవలు సజావుగా అందాలి. పలు అంచెల్లో ప్రభుత్వం విస్తరించి ఉండే మన వ్యవస్థలో, దీనికి జిల్లా పరిమాణం పెద్దదా? చిన్నదా? అన్నది అంతగా ప్రామాణికం కాదు, అది కొంతవరకే! పాలనా సౌలభ్యానికి చిన్న రాష్ట్రాలెంత సమర్థనీయమో, చిన్న జిల్లాలూ అంతే అనుసరణీయమన్నది స్ఫూర్తి. ప్రభుత్వ సేవలు అందు కునే క్రమంలో సామాన్యులకు తక్కువ శ్రమ-ఎక్కువ సౌలభ్యం కలిగించేలా చూసుకోవడంలో జిల్లా చిన్నదిగా ఉండటం కొంతమేర ఉపయోగకరం. అంతకు మించిన ప్రయోజనం మరొకటుంది. భౌగోళికంగా పరిమాణం తగ్గడం వల్ల జిల్లా అత్యున్నతాధికారి అయిన కలెక్టరుతో సహా జిల్లా ముఖ్య అధికారులందరికీ తమ అధీనంలోని శాఖాపరమైన వ్యవస్థపై నిఘా, నియం త్రణ తేలికవుతుంది. కచ్చితంగా ఫలితాలు రాబట్టుకునేలా చూసుకునే తీరిక, వెసలుబాటు వారికి లభిస్తుంది. అది ప్రజలకుపయోగమే! సగటున 50-60 మండలాలపై నియంత్రణ కన్నా 15-25 మండలాలపై నియంత్రణ సహజం గానే సులువవుతుంది. తమపై గట్టి నిఘా ఉన్నట్టు తెలిసి కింది వ్యవస్థ కూడా భయంతో పనిచేసే వాతావరణం పెరుగుతుంది. జిల్లా పెద్దగా ఉన్నపుడు జిల్లా కేంద్రంలో పనుల కోసం దూరప్రాంతాల నుంచి వెళ్లే వారికి కొంత ఇబ్బందయ్యేది. చిన్నదవడంతో అలాంటి వారికి ఇప్పుడా శ్రమ తప్పుతుంది. గ్రామ సభకు నిర్ణయాధికారం లేకుండా, ప్రాథమిక వైద్య కేంద్రంలో వైద్యు లు-మందులు అందుబడాటులో రాకుండా, సర్కారు కార్యాలయాల్లో చేయి తడపనిదే పనులు జరక్కుండా, బడులకు వరుసగా వారం-పది రోజులు రాకున్నా ఒకే రోజు వచ్చి సంతకాలు పెట్టుకునే టీచర్ల పద్ధతి మారకుండా 10 జిల్లాలు 31 అయితే మాత్రం ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న తలెత్తుతోంది. వీటన్నిటినీ పౌర సమాజం జాగ్రత్తగా గమనించాలి. మార్పు ఏ కొత్త ఫలి తాలూ ఇవ్వకుండా, మళ్లీ పాతపద్ధతిలోకే జారిపోయే దుస్థితిని అడ్డుకునే కాపలాదారుగా వ్యవహరించాలి. జనం చైతన్యం పొంది ఈ సంధికాలంలో అప్రమత్తంగా ఉండకపోతే, ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణపై శ్రద్ధ చూపక పోతే ఆశావహ దృక్పథంతో తెచ్చిన మార్పు కూడా ప్రతికూల ఫలితాలిచ్చే ప్రమాదముంది. అశ్రద్ధ చేస్తే అనర్థమే! జల్లాల పెంపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో కొంత నిజమున్నా, ప్రక్రి యను నిలిపివేయదగినంత పసలేదు. ఏకపక్షంగా తప్ప శాస్త్రీయంగా జరగ లేదని, పారదర్శకత లోపించిందని, ప్రత్యర్థుల్ని దెబ్బతీసే రాజకీయ ఎత్తుగ డలతో పాలకపక్షం జరిపించిందని విమర్శిస్తున్నారు. ఒక న్యాయ కమిషన్ వేసైనా స్వతంత్రంగా జరిపించి ఉండాల్సిందనేది వాదన. జిల్లా విభజనకు జనాభానో, నైసర్గిక స్వరూపాన్నో, సంస్కృతినో, గ్రామీణ-పట్టణ స్వభా వాన్నో... దేన్నీ ప్రామాణికం చేసుకోకుండా అడ్డగోలుగా జరిపించారనేది విపక్షాల విమర్శ. అందులో కొంత వాస్తవముంది. ఇంకా కొన్ని సమాధా నాలు రావాల్సిన సంక్లిష్ట ప్రశ్నలున్నాయి. రాజ్యాంగం అధికరణం 371-డి ప్రకారం ఉన్న జోనల్ వ్యవస్థను ఏం చేస్తారు? మేడ్చెల్ వంటి జిల్లాలో పరి మితంగా ఉన్న అయిదారు జడ్పీటీసీల సంగతేంటి? పక్క జిల్లాలో భాగంగానే కొనసాగిస్తారా? 2019లో పదవీ కాలం ముగిశాక వాటినేం చేస్తారు? ఓ జిల్లాలో 40 లక్షల జనాభా ఉంటే మరో జిల్లాలో 5 లక్షలే ఉంది, ఇంత అసమ తూకంతో ఎలా? ఇవన్నీ శేష ప్రశ్నలే! జిల్లాల పెంపును... ఉద్యోగులకు పదో న్నతులకు, కొత్తగా కొన్ని నియామకాలకు, రాజకీయ నిరుద్యోగుల పున రావాసానికే పరిమితం చేయొద్దని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. అభి వృద్ధి-సంక్షేమ కార్యక్రమాల అమలు, సేవల విస్తరణకు ప్రభుత్వం శ్రద్ధ తీసు కోవాలి. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని సర్కారు పెద్దలెంత చెబుతున్నా అన్నిస్థాయిల్లోనూ ఇప్పటికే అది బలపడిపోయింది. రాష్ట్రమంతా అదే ప్రాంతం, అన్నే వనరులు, అంతే జనాభా, అవే అవసరాలు... కానీ జిల్లాల సంఖ్య మూడింతలయింది. అధికారులూ పెరుగుతున్నారు. అదే నిష్పత్తిలో వివిధ స్థాయి రాజకీయ ప్రతినిధులూ పెరుగుతారు. ఇప్పుడున్న అవినీతిని నియంత్రించకుంటే, సగటున తలసరి లంచాలు రెండింతలో, మూడింతలో అయ్యే ప్రమాదముంది. పెరిగిన జిల్లాల్లో అభివృద్దికి బదులు అవినీతి మూడింతలయితే మాత్రం అది పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టే! అప్పుడు... పెరిగిన మన నేతలు, అధికారుల్ని తలచుకుంటూ బాలగంగాధర తిలక్ కవితను మననం చేసుకోవాల్సిందే. ‘‘దేవుడా రక్షించు నా దేశాన్ని... పెద్దమనుషుల నుంచి పెద్దపులుల నుండి/నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి... వారి వారి ప్రతినిధుల నుండి...’’ అని పాడుకోవాల్సి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త! వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ప్రజలకే అధికారం: ఆమ్ ఆద్మీ పార్టీ
తాము అధికారంలోకి వస్తే అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజలకే అధికారం కట్టబెడతామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) న్యూఢిల్లీ నగర వాసులకు ప్రమాణం చేసింది. అలాగే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని, లోక్‌పాల్ బిల్లును అమలు పరుస్తామని వెల్లడించింది. న్యూఢిల్లీ శాసనసభకు డిసెంబర్ 4వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ... రాజధాని నగరంలోని కాలనీల్లో అధికార వికేంద్రీకరణ పేరిట ప్రతి ఏటా 'కాలనీ అసెంబ్లీ' సమావేశాలు నిర్వహిస్తామని తెలిపింది. కాలనీల్లో అవసరమైన పనులపై కాలనీ వాసులే సొంతగా నిర్ణయం తీసుకుని అవసరమైన పనులను చేపట్టవచ్చిని వెల్లడించారు. అందుకు అవసరమైన నిధులు స్వయంగా అందజేస్తామని వివరించారు. ఆ అంశంలో రాజకీయ నాయకులు, అధికారులు జోక్యం ఎంత మాత్రం ఉండదని తెలిపారు. అలాగే షీలా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి న్యూఢిల్లీ వాసుల నడ్డి విరిచిందని ఆయన ఆరోపించారు. తాము విద్యుత్ ఛార్జీలను సగానికి సగం తగ్గించి నగర ప్రజలపై పడిన భారాన్ని తగ్గిస్తామని వివరించారు. న్యూఢిల్లీ పరిధిలోని విద్యుత్ పంపిణి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తామని ఆయన తెలిపారు. న్యూఢిల్లీలోని పోలీసులు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే పోలీసు వ్యవస్థను న్యూఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తామని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు.