సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్య విలువలు పెంచే విధంగా శాసనసభలో చర్చాలకు రావాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ శాసన సభ్యులు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. శాసన సభలో చర్చకు దూరంగా ఉండటం, శాసన సభ ఆమోదం తెలిపిన బిల్లులు అడ్డుకోవడం, జాప్యం చేయడంపై ధైర్యంగా చర్చకు రావాలని ప్రతిపక్షాన్ని డిమాండ్ చేశారు. నాడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడిన మాటలు, దివంగత ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు మాట్లాడిన మాటల గురించి చర్చించుకుందామన్నారు.
ఆంగ్లభాషా బిల్లుపై చర్చకు రాకుండా కాలయాపన చేశారని, నేడు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడిచినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేయరని స్పష్టం చేశారు, సీఎం వైఎస్ జగన్ ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తారన్నారు. దేశంలోనే ఒక ముఖ్యమంత్రి కుమారుడు సొంతంగా పార్టీ పెట్టి సీఎంగా నిలిచిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment