
సాక్షి, తాడేపల్లి: అమరావతి ఉద్యమం అనేది పచ్చి భూటకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. 250 రోజుల ఉద్యమం అని చెప్పుకుంటూ పది మందితో ఉద్యమం నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేయిస్తున్న జూమ్ ఉద్యమానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని విమర్శించారు. కారల్ మార్క్స్ సిద్ధాంతాలకు విరుద్ధంగా సీపీఐ, సీపీఐంలు వ్యవహరిస్తున్నాయన్నారు. కమ్యూనిస్టు పార్టీలు.. చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చుకోవాలని హితవు పలికారు. అసలు లేని అమరావతి ఉద్యమాన్ని అంతర్జాతీయ ఉద్యమంగా ప్రచారం చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి: ఉత్తరాంధ్ర ద్రోహులు చంద్రబాబు, రామోజీ)
మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తావా? అని చంద్రబాబును నిలదీశారు. ఎందుకు విశాఖపట్నంపై విషం కక్కుతున్నావని మండిపడ్డారు. దళితులపై ప్రేమ ఉంటే రాజధానిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. వైజాగ్ రాజధానిని అడ్డుకుంటే టీడీపీ నేతలు ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో చర్యలు తీసుకోమని డిమాండ్ చేసిన బాబు రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో ఎందుకు నోరు మీదపడం లేదని ఎమ్మెల్యే కరణం ప్రశ్నించారు. (చదవండి: తప్పుడు ఆరోపణలు ఉపేక్షించం)
Comments
Please login to add a commentAdd a comment