
సాక్షి, హిందూపురం: సొంత నియోజకవర్గంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజాసంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ వారు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో హైకోర్టును అడ్డుకుంటున్న బాలయ్య.. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ గోబ్యాక్ అంటూ నినదించారు.
Comments
Please login to add a commentAdd a comment