టీడీపీలో త్వరలో చీలిక రాబోతుందని, ఆ ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వయసు మీరిన నేతలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ చీలిపోతుందనే ఆందోళనతో ఏమి మాట్లాడుతున్నారో చంద్రబాబుకు అర్ధం కావడంలేదని, ఎల్లో మీడియా కూడా చంద్రబాబును మోసి మోసి అలిసిపోయిందని దుయ్యబట్టారు.