సాక్షి, అమరావతి : సినిమాల్లో కంటే రాజకీయాల్లో నటిస్తేనే ఎక్కువ డబ్బు వస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినట్టు కనిపిస్తోందని అనకాపల్లి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. అమరావతిలో పవన్ కల్యాణ్ పర్యటన విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా అమరావతి నుంచి రాజధాని మారుస్తానని చెప్పలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని.. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ను కూడా మేలు చేయాలనే సీఎం జగన్ ప్రతిపాదనలు చేశారని తెలిపారు. అమరావతి లో రైతులకు న్యాయం చేసే దిశలో చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని అన్నారు.
ఓ రోజు ప్రీపెయిడ్‌లా.. మరో రోజు పోస్ట్ పెయిడ్ లా...
ప్రశ్నిస్తామని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అంతకుముందు నూజివీడు గుంటూరులో రాజధాని పెడతానని చంద్రబాబునాయుడు చెప్పినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్టులు అని ఎవరు మాట్లాడలేదని, శేఖర్ చౌదరి అనే ఆర్టిస్ట్ తలపాగా పెట్టుకొని మాట్లాడటం వల్లే ఈ మాట వచ్చిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఒక రోజు ప్రీపెయిడ్.. మరోరోజు పోస్ట్ పెయిడ్ ఆర్టిస్టులా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఈ రాజకీయాల్లో పవన్ ఎందుకు నటిస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి రైతులను చంద్రబాబు నాయుడు అనవసరంగా రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ప్రాంతానికి నాయకుడా లేదా అన్ని ప్రాంతాలకు నాయకుడా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. (‘చంద్రబాబు తీరు ఆచరిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతి’)
ఆయన గురించి మాట్లాడుకోవటం దండగా
నిన్నటిదాకా సింగపూర్ లో షూటింగ్ చేసి.. ఇప్పుడు మంగళగిరిలో షూటింగ్ చేస్తున్నాడని పవన్ కల్యాణ్‌పై మంత్రి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు అయిదేళ్లు రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని పవన్.. ఇప్పుడు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవటం దండగా అని ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వస్తుంటే.. తిక్కలొడి గురించి ఎందుకని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం అమరావతి కూడా అభివృద్ధి చెందలేదని.. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment