సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని, ఎల్లో మీడియాతో విశాఖపై దుష్పచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కాగా ప్రజలను రెచ్చగొట్టి బాబు అబ్ది పొందాలని చూస్తున్నారని, ఇప్పటికైన ఆయన తీరు మార్చుకోవాలన్నారు. బాబుకు విశాఖ ప్రజల ఓట్లు కావాలి కానీ.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు మాత్రం వ్యతిరేకి అన్నారు. అమరావతితో పాటు రాష్ట్రం బాగుపడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరుకుంటుంటే.. బాబు మాత్రం తాను మాత్రమే బాగుపడాలని కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగలేదన్నారు. ఇక సీఎం జగన్‌కు మంచిపేరు వస్తుందనే బాబు అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
పెల్లుబికిన ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..
ఇక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని, ఆయనకు అమరావతి తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరం లేదని ధ్వజమెత్తారు. ఇక బాబుపై ప్రజాగ్రహం పెల్లుబికిందని అందుకే ఎయిర్‌పోర్టులో బాబును ప్రజలు అడ్డుకున్నారని విమర్శించారు. అరగంట పాటు విమానాశ్రమంలో ఉండాలని పోలీసులు సూచించినా బాబు పట్టించకోలేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టి అబ్ధిపోందేందుకు చంద్రబాబు ప్రణాళికలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment