
సాక్షి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాల లీజు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. గిరిజనులందరి తరఫున తాము సీఎంకు కృతజ్ణతలు చెబుతున్నామన్నారు. తవ్వకాల ద్వారా వచ్చే కోట్ల రూపాయిల ఆదాయంపైనే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందనివిమర్శించారు. బాక్సైట్ తవ్వకాలను నిషేదిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జీఓ నెంబర్ 97 తీసుకువచ్చి బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చారని గుర్తుచేశారు.
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శుక్రవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాల లీజును రద్దు చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. మూడు నెలలలోనే మాట నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్ నిర్ణయాన్ని చాలా మంది హేళన చేశారు. బాక్సైట్ తవ్వకాలు జరిపితే కోట్ల రూపాయిల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందంటున్నారు. కానీ బాక్సైట్ తవ్వకాలతో వచ్చే ఆదాయం కన్నా గిరిజనుల జీవితాలే ముఖ్యమనుకున్నారు. బాక్సైట్ తవ్వకాల లీజు రద్దు చేయడం వల్ల గిరిజనులంతా జీవితాంతం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment