
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్‌లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'పవన్ కల్యాణ్ ఆంధ్రరాష్ట్రానికి పనికిరాడు. చిరంజీవి లేకుండా పవన్ కల్యాణ్ ఎవరికి తెలుసు. మెగాస్టార్ లేనిదే.. పవర్‌స్టార్ ఎక్కడ?. నాగబాబుకి విధి విధానం లేదు. చిరంజీవి ఫ్యాన్స్‌ను నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం జనసేనకి సపోర్ట్ చేయాలని నాగబాబు చెప్పడం.. చిరంజీవిని అవమానించటమే. పవన్ కల్యాణ్ మాటలోడే తప్ప చేతలోడు కాదు. మొట్ట మొదట అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకొని పవన్ మాట్లాడాలి. మోడీ, అమిత్ షాలకు పవన్ వెదవ వేషాలు తెలుసు. బిజెపితో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ రాష్ట్ర సంక్షేమం కోసం ఒక్కరోజైనా పని చేశారా. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని పవన్ కల్యాణ్ బిజెపితో టచ్‌లో ఉన్నాడు. బిజెపి వాళ్లు పవన్ కల్యాణ్‌ని పట్టించుకోవడం లేదు. పవన్ మాత్రం బిజెపి భజన చేస్తున్నాడు' అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
చదవండి: (ఉద్యోగుల బాగు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది: సజ్జల)