'ఉదయం షూటింగ్‌లు.. సాయంత్రం బాబుతో మీటింగ్‌లు' | Vellampalli Srinivas Fires On Pawan Kalyan In Vijayawada | Sakshi
Sakshi News home page

'ఉదయం షూటింగ్‌లు.. సాయంత్రం బాబుతో మీటింగ్‌లు'

Published Wed, Jan 22 2020 12:01 PM | Last Updated on Wed, Jan 22 2020 12:21 PM

Vellampalli Srinivas Fires On Pawan Kalyan In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : పవన్‌ కల్యాణ్‌ రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అని, అతను మాట మీద నిలబడేవాడు కాదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు.వెల్లంపల్లి శ్రీనివాస్‌ మున్సిపల్‌ అధికారులతో కలిసి  బుధవారం విజయవాడలోని భవానీపురం 28వ డివిజన్‌లో పర్యటించారు.నగర అభివృద్ధే ద్యేయంగా రూ. కోటి 40 లక్షల రూపాయలతో బైపాస్‌ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వీలైనంత తొందరగా  రోడ్డు,డ్రైనేజీలు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.(టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం)

ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. పవన్‌ వాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, అది నోరా లేక తాటిమట్టా అని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఆయనను ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ ఉదయం సినిమా షూటింగ్‌లో పాల్గొని సాయంత్రం చంద్రబాబుతో మీటింగ్‌లు చేస్తున్నారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. బాబు డైరక్షన్లో బీజేపీ ముసుగులో పవన్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని ఆపాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అభివృద్ధిని ఆపాలని చూస్తే ఏపీలో ఎక్కడా తిరగలేవని, సీఎం జగన్‌పై  అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే అతనికి సరైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. (బాబుకు చిల్లర రాజకీయాలు అలవాటే: నాని)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement