development programmes
-
పల్లెబాటల్లో ప్రగతి వేగం.. హర్షం వ్యక్తం చేస్తున్న పల్లె ప్రజలు!
కర్నూలు(అర్బన్): దశాబ్దాల తరబడి గుంతలు పడిపోయి, కనీసం నడిచేందుకు కూడా వీలు లేని గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన పల్లె రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాబార్డు నిధులు రూ.189.29 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 39 పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే రెండు జిల్లాల్లో 257.79 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చెందనున్నాయి. కోడుమూరు మండలం క్రిష్ణాపురం రోడ్డు పనులను పరిశీలిస్తున్న అధికారులు రహదారులు అభివృద్ధి చెందుతుండటంతో పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 28 రోడ్లను బాగు చేసున్తన్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.187.27 కోట్లతో పాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. దీంతో ఆయా పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు పీఆర్ ఇంజినీర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేగంగా జరుగుతున్న పనుల్లో కొన్ని ... ► పత్తికొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మద్దికెర నుంచి మొలగవెల్లి మీదుగా ఆలూరు వరకు రూ.8.15 కోట్లతో 14.90 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తున్నారు. ► కోడుమూరు మండలం కర్నూలు – బళ్లారి ప్రధాన రహదారి నుంచి క్రిష్ణాపురం వరకు రూ.2.97 కోట్లతో 4.10 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. ► కోడుమూరు మండలం వర్కూరు నుంచి మెరుగుదొడ్డి వరకు రూ.4.50 కోట్లతో 12.05 కిలోమీటర్ల మేర రోడ్డును వేస్తున్నారు. ► దేవనకొండ మండలం కర్నూలు – బళ్లారి మెయిన్ రోడ్డు నుంచి కొత్తపేట మీదుగా పుల్లాపురం వరకు రూ.3 కోట్లతో 5.8 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ ప్రాధాన్యత రోడ్ల పనుల్లో భాగంగా చేపట్టిన పనులు పూర్తయితే దాదాపు వంద గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పనులు కొనసాగుతున్నాయి. వీటిని పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు చెందిన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో మద్దికెర – ఆలూరు రోడ్డు ప్రస్తుతం మద్దికెర – ఆలూరు రోడ్డు పనులు ఏఈ స్థాయి నుంచి డీఈఈ, ఈఈ, ఎస్ఈ వరకు వారంలో ఎవరో ఒక అధికారి ఈ పనులను పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు. దీంతో పనుల్లో వేగం పెరుగుతోంది. దశల వారీగా నాణ్యతను సంబంధిత అధికారులు పరీక్షించిన తర్వాత మరో దశ పనులు చేపడుతున్నారు. నిధుల కొరత లేదు ప్రభుత్వం ఆమోదించిన రోడ్ల పనులకు ఎలాంటి నిధుల కొరత లేదు. ఈ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి నాణ్యతతో పూర్తి చేయనున్నాం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొత్తం 39 రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ రోడ్ల పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు కూడా ఈ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. – కే సుబ్రమణ్యం, పీఆర్ ఎస్ఈ -
ఉత్తరాంధ్ర అభివృద్ధి పవన్‌కు ఇష్టంలేదు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్ కల్యాణ్‌కు ఏమాత్రం ఇష్టంలేదని ఆయన మాటలనుబట్టి అర్థమవుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఎర్రమట్టి దిబ్బలపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఎర్రమట్టి దిబ్బలు ఆక్రమిస్తున్నారంటూ పవన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి, ఎర్రమట్టి దిబ్బలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కొత్తవలసలో వీఎంఆర్డీఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో భూ కుంభకోణాలు బయట పెడతానంటూ నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ వాటిని నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని వ్యాఖ్యానించారు. “మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది.్ఙ అని హితవు పలికారు. చంద్రబాబు హయాంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కబ్జాకు గురైతే పెదవి విప్పని పవన్ ఇప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆయన పర్యటించిన ప్రాంతంలో ఎక్కడా లోపాలు దొరక్కపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కీ, మోదీకి చెప్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ ఇక్కడ ఉండే ఒకట్రెండు రోజుల్లోనైనా ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోవాలని, అవాస్తవాలను మాత్రం మాట్లాడొద్దని సూచించారు. -
ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 506 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పథకం పనులకు ప్రధాని మోదీ ఈ నెల 6న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ.24,470 కోట్లను వెచి్చంచనుంది. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త, మెరుగైన సూచికల ఏర్పాటు, ఆధునిక మౌలిక వసతుల కల్పన వంటి వాటికి ఈ మొత్తాన్ని వెచి్చస్తారని పీఎంవో తెలిపింది. మొత్తం 508 స్టేషన్లలో తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్‌లోని18 రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 1,309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చే యాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు లో భాగంగా తాజాగా ఒకేసారి 506 స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. -
CM Jagan Vizag Tour : విశాఖలో సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
CM Jagan: విశాఖలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
CM YS Jagan Vizag Tour Live Updates ► సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన ముగిసింది. ► ఏయూ కన్వెన్షన్ హాల్లో.. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు సాహితి, సాయి కార్తికేయలను ఆశీర్వదించారు సీఎం వైఎస్ జగన్. ► బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసింది ఈ మ్యూజియంను. మ్యూజియంను ప్రారంభించిన అనంతరం లోపల అధికారులతో కలియతిరిగి తిలకించారు సీఎం జగన్. ► సీ హ్యారియర్ మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ► మరికాసేపట్లో.. ఆర్కే బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభించనున్న సీఎం జగన్. ► ఆరిలోవలోని అపోలో ఆస్పత్రిలో క్యాన్సర్ సెంటర్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం అక్కడి సిబ్బందితో ఆయన కాసేపు మాట్లాడి.. వాళ్ల విజ్ఞప్తి మేరకు గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం క్యాన్సర్ యూనిట్‌లోని రేడియేషన్ ఎక్విప్మెంట్ను పరిశీలించారు సీఎం జగన్. ► పీఎం పాలెం నుంచి అపోలో హాస్పటల్ కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. మరికాసేపట్లో ఆరిలోవలోని అపోలో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం. ► వైఎస్సార్ క్రికెట్‌స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజీ ప్లేయర్స్‌తో ముచ్చటించారాయన. క్రీడల్లో మరింత రాణించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ► విశాఖ పర్యటనలో.. పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో క్రీడాకారులను సీఎం జగన్ కలిశారు. మహిళా క్రికెటర్లు సబనామ్, అంజలిని ప్రత్యేకంగా అభినందించారాయన. కాసేపట్లో ఏపీఎల్ సీజన్-2 ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ► వైఎస్సార్ స్టేడియంలో ఫొటో ఎగ్జిబిషన్‌న్ సందర్శించిన సీఎం జగన్.. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగారు. ► క్రికెట్ స్టేడియంలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. ► పీఎం పాలెం చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ► కాసేపట్లో పీఎం పాలెం(పోతులమల్లయ్య పాలెం)లోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియానికి సీఎం జగన్.. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ. ► విశాఖ చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం. నగర మేయర్ హరివెంకటకుమారితో పాటు మంత్రి అమర్నాథ్, విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు.. సీఎం జగన్‌కు ఆత్మీయ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు. ► పాలనా రాజధానిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు శంకుస్థాపనల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు బయల్దేరారు. ► విశాఖ పర్యటనలో భాగంగా.. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి విశాఖకు విమానంలో బయల్దేరారు. నగరంలో వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారాయన. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలోకి తనయుడితో మాజీ ఎమ్మెల్యే -
సీఎం జగన్ అనకాపల్లి పర్యటన (ఫొటోలు)
-
వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి: సీఎం జగన్
సీఎం జగన్ అచ్యుతాపురం పర్యటన.. అప్డేట్స్ ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ►రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా సహకారం ►జపాన్ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ►15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగాం ►ప్రభుత్వం ఇచ్చే సహకారంతో సెకండ్ ఫేజ్‌కు ముందుకొచ్చారు ►ఆగస్టు 2023 నాటికి రెండో ఫేజ్ పనులు పూర్తి చేసే అవకాశం ►ఒక ప్రాంత అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి ►ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం ►వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి ► రూ. 1.54లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 1,00,155 మందికి ఉద్యోగాలు ►మూతపడ్డ ఎంఎస్ఎమ్ఈ పరిశ్రమలకు చేయూతినిస్తున్నాం ►ఎంఎస్ఎమ్ఈల పునరుద్ధరణకు రూ.1463 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చాం. ►రాష్ట్రంలో దాదాపు లక్ష వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ► రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. ►అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు ►విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్ ఏర్పాటు సీఈవో నితిన్ కామెంట్స్ ►ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉందని సీఈవో నితిన్ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రపంచంలోనే బెస్ట్ ప్లాంట్‌గా యూనిట్‌ను తయారు చేస్తామని సీఈవో నితిన్ అన్నారు. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ► ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్ ► ఏటీసీ టైర్ల పరిశ్రమను పరిశీలిస్తున్న సీఎం జగన్.. కంపెనీ ప్రతినిధులతోనూ మాట్లాడుతున్నారు. ►అచ్యుతాపురం సెజ్‌లో సీఎం వైఎస్ జగన్.. ►సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్న సీఎం జగన్ అచ్యుతాపురం సెజ్ కి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అచ్యుతాపురం సెజ్‌కు చేరుకున్నాడు. అక్కడి ఏటీసీ టైర్ల కంపెనీలోని హెలిప్యాడ్ వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. ► ఉపముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, అనకాపల్లి ఎంపి సత్యవతితో పాటు స్వాగతం పలికిన వాళ్లలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ రవి సుభాష్, డి. ఐ. జి హరికృష్ణ,ఎస్పీ గౌతమీ శాలి ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యేలు యువి కన్నబాబు రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబూరావు, అన్నoరెడ్డి అదీప్ రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్,మాజీ డీసిసిబి చైర్మన్ సుకుమారవర్మ, గవర కార్పోరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, విశాఖ డెయిరీ వైస్ చైర్మన్ మరియు విశాఖ వెస్ట్ ఇన్ ఛార్జి ఆడారి ఆనంద్ తదితరులు ఉన్నారు. ► అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో.. రూ.1,002.53 కోట్లతో మరో ఎనిమిది పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్. ► అచ్యుతాపురం సెజ్‌లో తొలి దశలో రూ.1,384 కోట్లతో యూనిట్ ఏర్పాటు. రూ.816 కోట్లతో రెండో దశ పనులకు భూమి పూజ చేయనున్న సీఎం జగన్. ► కాసేపట్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి సీఎం జగన్. ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్న సీఎం జగన్. ► అచ్యుతాపురం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలు.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు తొలుత చేరుకుంటారు. ► అచ్యుతాపురం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరారు. ఎస్ఈజెడ్లో పలు భారీ పరిశ్రమలకు శ్రీకారం చుట్టడానికి, ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ► పర్యటనలో భాగంగా.. అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో గల ఏటీసీ టైర్ల పరిశ్రమ వద్దకు చేరుకుంటారు. ముందుగా స్థానిక నేతలతో ఆయన ముచ్చటిస్తారు. ఆపై అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో పలు భారీ పరిశ్రమలకు శ్రీకారం చుడతారు. ► ముందుగా పరిశ్రమలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఏటీసీ టైర్ల కంపెనీ రెండూ ఫేజ్‌కు, మరో 8 కంపెనీలకు శంకుస్థాపన చేస్తారు. ► తిరిగి మధ్యాహ్న సమయంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు, కోడల్ని సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం సమయంలోనే ఆయన తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. ►అచ్యుతాపురం, రాంబిల్లి క్లస్టర్ సెజ్‌కు 2000 సంవత్సరం తర్వాత అడుగులు పడ్డాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ సెజ్‌కు కీలక అనుమతులు వచ్చాయి. మొత్తం ఆరు వేల ఎకరాలను సేకరించారు. ► ఈ ప్రత్యేక ఆర్థిక మండలికి సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండటం ప్లస్ పాయింట్. ఇప్పటి వరకూ 60 వేల మందికి ఈ సెజ్‌లో ఉపాధి అవకాశాలు కల్పించారు. విశాఖ–చెన్నై కోస్టల్ కారిడార్‌లో అచ్యుతాపురం సెజ్‌కు కీలక స్థానం ఉందనే చెప్పాలి. పూడిమడక వద్ద ఏర్పాటు కానున్న హార్బర్ ద్వారా మరిన్ని దేశాలతో ఈ సెజ్ తన కార్యకలాపాల్ని విస్తరించనుంది. ► ఇప్పటికే బార్క్, బ్రాండిక్స్, ఆసియన్ పెయింట్స్ వంటి బ్రాండెడ్ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సెజ్‌లో యకహోమా కంపెనీ రూ.1,200 కోట్లతో తన కార్యకలాపాల్ని మంగళవారం ప్రారంభించనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ విజనరీ ఉన్న నాయకుడు: సౌరభ్ గౌర్
-
ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలబెడతాం: గుడివాడ అమర్నాథ్
-
తిరుపతి అంటే గుళ్ళు గుర్తొస్తుండే.. కానీ ఇప్పుడు: మధుసూధన్‌రెడ్డి
-
సన్నీ ఆప్కో టెక్ ద్వారా 3 వేలమందికి ఉపాధి: సీఎం వైఎస్ జగన్
-
సన్నీ అపోటెక్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ సంస్థను ప్రారంభించిన సీఎం జగన్
-
ఎల్లో మీడియా పై ధ్వజమెత్తిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
అభివృద్ధి పనులపై సమీక్ష
కూకట్పల్లి: ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్‌తో చర్చించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన 58, 59 జీఓలపై చర్చించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్దీకరణ చేస్తుందని తెలిపారు. అంతకు మించి భూమి ఉంటే రిజి్రస్టేషన్ ధరలకు అనుగుణంగా నాల్గో వంతు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఇందిరానగర్ బస్తీతో పాటు మరికొన్ని బస్తీల్లో క్రమబద్దీకరణ కాని స్థలాల వివరాలను ఎమ్మెల్యే మాధవరం కలెక్టర్‌కు అందజేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని హామీనిచి్చనట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించి అన్ని ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. పెండింగ్‌లో ఉన్న పింఛన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. మన ఊరు..మన బడి ద్వారా కూకట్పల్లి నియోజకవర్గంలో 12 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ హరీష్ తెలిపారు. -
ఉత్త సక్సెస్ కాదు.. గొప్ప సక్సెస్ కావచ్చని నిరూపించింది!
యూట్యూబ్‌లో అందరూ వీడియోలు చేస్తారు. కాని ప్రాజక్తా కోలి సరదా వీడియోలతో పాటు బాధ్యత కలిగిన వీడియోలు చేసేది. ∙ఆడపిల్లల చదువు ∙బాడీ షేమింగ్ ∙మానసిక ఆరోగ్యం వీటి పట్ల చైతన్యం కలిగించే వీడియోలు పెద్ద హిట్. 65 లక్షల సబ్స్క్రయిబర్లు కలిగిన ఒక యువ యూట్యూబ్ స్టార్‌గా యువత మీద ఆమె ప్రభావాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యు.ఎన్.డి.పి)కి మన దేశ ‘తొలి యూత్ క్లయిమేట్ ఛాంపియన్’గా ఎంపిక చేసింది. యువత బాధ్యత చూపితేమరింత గుర్తింపు తెచ్చే బాధ్యత వస్తుందనడానికి ప్రాజక్తా ఒక ఉదాహరణ. గలగలమని పొంగే మాట, నిశితమైన గమనింపు, భళ్లుమనే వ్యంగ్యం, లక్ష్యాన్ని చేరుకునే చురుకుదనం ఉంటే సక్సెస్ కావచ్చా? ఉత్త సక్సెస్ కాదు గొప్ప సక్సెస్ కావచ్చు అని ప్రాజక్తా కోలి నిరూపించింది. తన సరదా వీడియోలతో వ్యక్తుల ప్రవర్తనను, లోకం పోకడలను ఎత్తి చూపే ప్రాజక్తా తొలితరం యూట్యూబ్ స్టార్లలో అందరి కంటే అందనంత ఎత్తుకు చేరుకుంది. అందుకే ఐక్యరాజ్య సమితి తన ‘డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ కింద పర్యావరణ స్పృహ కలిగించే వివిధ దేశాల యూత్ క్లయిమెట్ ఛాంపియన్ల ఎంపికలో భాగంగా ప్రాజక్తాను మన దేశం నుంచి తొలిసారిగా ‘యూత్ క్లయిమేట్ ఛాంపియన్’గా ఎంపిక చేసింది. 28 ఏళ్ల ప్రాజక్తా ఇక మీదట మన దేశంలోని యువతలోనే కాదు అనేక దేశాల యువతలో కూడా పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇప్పటికే ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేస్తున్న లియొనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి పని చేయనుంది. ఒక భారతీయ యువతికి దక్కిన గొప్ప గుర్తింపు ఇది. ‘ఇది నాకు ఇష్టమైన పని. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రాజక్తా ఈ సందర్భంగా. మనం మార్చగలం ‘ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మనమే తెచ్చాం. మనమే వాటిని పరిష్కరించగలం. నా దృష్టిలో యువత ఈ విషయంలో మొదటి వరుస సైనికులుగా ఉండాలి. యువత తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. పర్యావరణ విధ్వంసం వల్ల భవిష్యత్తులో మానవజాతే అంతరించి పోయే పరిస్థితులు వస్తాయి. అలా జరక్కుండా ఉండటానికి మన దేశంలో యువత చైతన్యవంతం కావాలి. అందుకు నేను పని చేస్తాను. అలాగే ప్రపంచ యువత ఆలోచనలను పంచుకుంటాను’ అంది ప్రాజక్తా. (చదవండి: ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు.. చదువు, చావు!) థానే అమ్మాయి ప్రాజక్తా మహరాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. ముంబైలో చదువుకుంది. తండ్రి మనోజ్ కోలీ చిన్న సైజు రియల్టర్. తల్లి అర్చన కోలి టీచర్. ఈమెకు నిషాంత్ అనే తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ప్రాజక్తా ఉత్త వాగుడుకాయ. స్కూల్లో ప్రతి పోటీలో పాల్గొని మాట్లాడేది. ప్రైజులు కొట్టేది. తమ అమ్మాయి ఇంట్లో, క్లాస్‌రూమ్‌లో వొదిగి ఉండటానికి పుట్టలేదని, స్టేజ్ మీద జనాన్ని అలరించడానికి పుట్టిందని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ప్రాజక్తాను బాగా ప్రోత్సహించారు. ఆరవ తరగతిలోనే రేడియో జాకీ అవ్వాలనుకున్న ప్రాజక్తా కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసి ముంబై ‘ఫీవర్’ రేడియోలో ఒక సంవత్సరం ఇన్‌టర్న్‌గా చేసింది. కాని ఆ ఉద్యోగం ఆమెకు సంతృప్తి ఇవ్వలేదు. అయితే ఆ సమయంలో గెస్ట్‌గా వచ్చిన హృతిక్ రోషన్‌తో ప్రాజక్తా చేసిన ఒక చిన్న వీడియో చూసిన డిజిటల్ కంటెంట్ ఎక్స్పర్ట్ సుదీప్ లహరీ ‘నీ మాటలో మంచి విరుపు ఉంది. ఇది యూట్యూబ్ యుగం. యూ ట్యూబ్ చానల్ మొదలెట్టు’ అని సలహా ఇచ్చాడు. అలా 2015లో ప్రాజక్తా మొదలెట్టిన యూట్యూబ్ చానల్ ‘మోస్ట్‌లీసేన్’. మోస్ట్‌లీసేన్ ‘మోస్ట్‌లీసేన్’ చానల్లో అన్నీ తానుగా ప్రాజక్తా వీడియోలు చేసి రిలీజ్ చేస్తుంది. అంటే వీడియోలో ఆమె ఒక్కతే రకరకాల పాత్రలుగా కనిపిస్తుంది. అందుకు ఆమె తాను గమనించిన మనుషుల ప్రవర్తనలను ముడి సరుకుగా చేసుకుంటుంది. ‘మనకు తెలిసిన 10 రకాల టీవీ ప్రేక్షకులు’, ‘పది రకాల విద్యార్థులు’, ‘వీరండీ మన ఇరుగు పొరుగు’, ‘మన అమ్మలు... వారి చాదస్తాలు’... ఇలా టాపిక్ తీసుకుని ఆ పాత్రలన్నీ తానే ధరిస్తుంది. ఈ వీడియోల్లో తమను తాము చూసుకున్న ప్రేక్షకులు వెంటనే సబ్స్క్రయిబర్లుగా మారారు. ఒక్క సంవత్సరంలోనే లక్ష మంది సబ్స్క్రయిబర్లను పొందింది ప్రాజక్తా. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 65 లక్షలకు చేరింది. వారంలో మూడు వీడియోలు ఆమె విడుదల చేస్తే యూట్యూబ్ ద్వారా బోలెడు ఆదాయం వచ్చి పడుతోంది. మిషేల్ ఒబామాతో కాఫీ ప్రాజక్తా కేవలం ఈ వీడియోలే కాదు. ఆమె స్త్రీల పక్షపాతి. అమ్మాయిలు బాగా చదవాలని దాదాపుగా అన్ని వీడియోల్లో చూపుతూ చెబుతూ ఉంటుంది. హేట్ టాక్, బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ తదితర దుర్లక్షణాల మీద కటువైన వ్యంగ్యంతో చేసిన వీడియోలు ఆమెకు గౌరవం తెచ్చి పెట్టాయి. ‘ఐ ప్లెడ్జెడ్ టు బి మీ’ అనే పేరుతో ఆమె చేసిన కాంపెయిన్ చాలామంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇవన్నీ ఆమెకు అవార్డులు, పెద్ద పెద్ద సంస్థల సోషల్ కాంపెయిన్లో భాగస్వామ్యాలు తెచ్చి పెట్టాయి. న్యూఢిల్లీలో ఆమె మిషేల్ ఒబామాతో కాఫీ తాగి కబుర్లు చెప్పే స్థాయికి ఎదిగింది. అంతే కాదు యూట్యూబ్ సిఇఓ సుజేన్ వూను ఇంటర్వ్యూ చేయగలిగే ఏకైక భారతీయ యూట్యూబర్‌గా ఎదిగింది. ఇవన్నీ ఆమె తన ఆకర్షణీయమైన మాటతోనే సాధించింది. యువత తన కెరీర్ కోసం కష్టపడాలి. తప్పదు. దాంతో పాటు సామాజిక బాధ్యత చూపిస్తే ప్రాజక్తాలా గొప్ప గొప్ప బాధ్యతలు వరిస్తాయి. జీవితంలో సక్సెస్‌ను అలా కదా చూడాలి. -
ఏపీ: రేపు రైతు దినోత్సవం.. కార్యక్రమాలివే..
సాక్షి, అమరావతి: రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున చేపట్టే కార్యక్రమాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులిచ్చారు. రైతు దినోత్సవ కార్యక్రమాలివే.. ►రూ.413.76 కోట్లతో నిర్మించిన 1,898 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, రూ.79.50 కోట్లతో నిర్మించిన 65 వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు, 8 ఆక్వా ల్యాబ్‌లు, 25 సీఏడీడీఎల్‌లను ప్రారంభిస్తారు. ►సన్న, చిన్నకారు రైతులకు సాగు యంత్రాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఆర్బీకేలకు అనుబంధంగా రూ.96.64 కోట్లతో 611 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల (సీహెచ్‌సీల)తో పాటు పాడి రైతుల కోసం ప్రత్యేకంగా 34 సీహెచ్‌సీలను ప్రారంభిస్తారు. ►రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 కొత్త వెటర్నరీ హాస్పిటల్స్, డిస్పెన్సరీలు, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లతో పాటు విశాఖపట్నంలోని స్మైల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, రూ.7.53 కోట్లతో విజయవాడలో పాడి రైతుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ►ఆర్బీకేల ద్వారా పాడి రైతులకు 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, 60 శాతం సబ్సిడీతో టీఎంఆర్ బ్లాక్స్, 50 శాతం సబ్సిడీపై మినరల్ మిక్చర్, చాప్ కట్టర్స్ పంపిణీకి శ్రీకారం. ►రూ.400.30 కోట్లతో ఆర్బీకేల స్థాయిలో నిర్మించతలపెట్టిన 1,262 గోడౌన్లకు, రూ.200.17 కోట్లతో కోత అనంతర మౌలిక సదుపాయాల కల్పనకు, మార్కెట్ యార్డుల్లో రూ.212.31 కోట్లతో ఆధునికీకరణ, అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు, రూ.45 కోట్లతో 45 కొత్త రైతు బజార్లకు శంకుస్థాపనలు చేస్తారు. రూ.3 కోట్లతో ఏర్పాటు చేస్తున్న 6 రైతు బజార్లను ప్రారంభిస్తారు. ►రూ.15 కోట్లతో నాబార్డు సీబీఎస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన ఆప్కాబ్ 13, డీసీసీబీ 24 బ్రాంచ్‌లకు శ్రీకారం చుడతారు. ►రాష్ట్ర స్థాయిలో 13 మందిని రూ.2.5 లక్షలు, జిల్లా స్థాయిలో నలుగుర్ని రూ.25 వేలు, మండల స్థాయిలో నలుగుర్ని రూ.5 వేల నగదు ప్రోత్సాహకాలతో సత్కరిస్తారు. -
‘కేసీఆర్ పేదింటి మేనమామగా నిలుస్తున్నరు’
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్ఎస్దేనని.. ప్రజలు తమ పార్టీ, ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్‌లో వివిధ అభివృద్ధి పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ఉగాది నుంచి వరంగల్ మహానగర ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఒక్కరోజు ముందుగానే రూ.1,589 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని రాంపూర్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత పలుచోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా రు. ఖిలావరంగల్, న్యూశాయంపేటల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.75 పింఛన్ ఇచ్చేవారు. వాడకట్టులో 50 మందికి వస్తే 500 మందికి రాకపోయేది. కొత్త వారికి కావాలంటే ఎవరో ఒకరు చనిపోతే మీ పేరు రాస్తమనేటోళ్లు. కాంగ్రెసోళ్లు వచ్చి రూ.75ను రూ.200 చేసి, భారత్‌లో ఎవరూ చేయనట్లు వారే చేశామని డైలాగులు కొట్టారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పెన్షన్‌ను రూ.2016 చేసుకున్నం. గతంలో 29లక్షల మందికే పింఛన్ వచ్చేది. ఇప్పు డు 40 లక్షల మందికి ఇస్తున్నం. త్వరలోనే అర్హులైన పేదలకు కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు ఇస్తం’అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటుంటారు.. కానీ సీఎం కేసీఆర్ ఆ ఇళ్లు నేనే కడతా, పెళ్లి నేనే చేస్తా అంటున్నరు. పేదల కష్టసుఖాలు తెలిసిన మన ముఖ్యమంత్రి ఆ రెండూ చేస్తున్నరు. పేదింటి మేనమామగా నిలుస్తున్నరు’అని కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో అక్కడక్కడా ఆలస్యం జరిగినా.. ప్రతీ పేదవాడికి ఇల్లు, పేదింటి ఆడ బిడ్డ పెళ్లిని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్నారు. పలు చోట్ల అడ్డగింత.. కేటీఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ, ఇతర పార్టీలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఆదివారం రాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. అయినా.. ఏబీవీపీ, పీడీఎస్‌యూ నాయకులు వరంగల్ పోచమ్మమైదాన్, హన్మకొండలోని కేయూ కూడలి వద్ద కాన్వాయ్‌కు అడ్డొచ్చారు. అయితే, అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని నిలువరించి పక్కకు తొలగించారు. కాంగ్రెస్‌ది మొండిచేయి.. బీజేపీది గుడ్డిచేయి.. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా బీజేపీ వాళ్లు ఎగిరెగిరిపడుతున్నరు. మోదీ ఆనాడు జన్ ధన్ ఖాతా ఖోలో.. పంద్రా లాక్ లేలో.. అన్నరు. రూ.15 లక్షలు ఎంతమందికి వచ్చాయో చెప్పండి’అని మంత్రి అడిగారు. ఎవరూ స్పందించకపోవడంతో ‘కాంగ్రెసోళ్లది మొండిచేయి, బీజేపీది గుడ్డిచేయి’అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు వరంగల్ మీద ప్రేమ ఉండటం వల్లే బడ్జెట్లో ఏటా రూ.300 కోట్లిస్తూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వరంగల్‌లో ఒకేరోజు రూ.2,500 కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేసుకున్నామని వెల్లడించారు. వరంగల్‌కు నియో రైలు, మామునూరుకు ఎయిర్‌పోర్టు తెస్తామని, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అయితే, వరంగల్‌ను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్‌లోని ఆడబిడ్డల దాహార్తిని రూ.1,589 కోట్లతో తీరుస్తామని మాట ఇచ్చి ఉగాదికి ఒక రోజు ముందే చేసి చూపించిన ప్రభుత్వం తమదని తెలిపారు. వరంగల్ అభివృద్ధిపై వారం రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని, దానిపై దమ్ముంటే చర్చకు రావాలని ప్రతిపక్షాలకు కేటీఆర్ విసిరారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేతలకు ఇదే చివరి హెచ్చరిక.. ‘సీఎం కేసీఆర్ వయసు, హోదా కూడా చూడకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నరు. ఇదే మీకు చివరి హెచ్చరిక. కేసీఆర్‌ను దూషిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు’అని కేటీఆర్ హెచ్చరించారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఎన్ఐటీలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్న కేసీఆర్ నీతిఆయోగ్ లాంటి సంస్థల ప్రశంసలు అందుకున్నారని, స్వయంగా కేంద్రమే అభినందిస్తుంటే కొందరు కొత్త బిచ్చగాళ్లు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. మేం నరేంద్ర మోదీ, అమిత్‌షాపై మాట్లాడవలసి వస్తుందన్నారు. ‘నేను తమ్ముడు సునీల్‌నాయక్ వీడియోను చూశా. ఐఏఎస్ కావాల్సిన వాడిని ఆత్మహత్య చేసుకుంటున్నా.. అన్న అతని మాటలు నన్ను చాలా బాధించాయి. ఐఏఎస్ నోటిఫికేషన్ కేంద్రం, యూపీఎస్సీ ఇస్తుందన్న విషయం కూడా చెప్పకుండా కొందరు రెచ్చగొట్టారు. వరుస ఎన్నికల వల్ల నోటిఫికేషన్ ఇవ్వలేకపోయాం. త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తం’అని కేటీఆర్ అన్నారు. -
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట: లక్ష్మీనరసింహస్వామి ఆలయ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ గురువారం యాదాద్రికి రానున్నారు. హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. ముందుగా స్వామివారి పూజలో పాల్గొంటారు. అనంతరం ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండకింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న, పూర్తయిన, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు వైటీడీఏ, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో స్వయంభూ స్వామివారి పునఃదర్శనాలపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు బుధవారం సాయంత్రం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ముందస్తు దెబ్బ.. అంత ఈజీ కాదు!
సాక్షి, సిటీబ్యూరో: మునుపెన్నడూ లేని విధంగా బల్దియా పాలక మండలి ఎన్నికలు ముందస్తుగా నిర్వహించడంతో పలు అంశాల్లో అయోమయం నెలకొంటోంది. రెండు నెలల కంటే ముందుగానే కొత్త కార్పొరేటర్ల ఎన్నిక జరిగినప్పటికీ, కొత్త సభ కొలువుదీరలేదు. దీంతో పది నెలలుగా పాలకమండలి సర్వసభ్య సమావేశం జరగలేదు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న.. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన 68 పనులపై సందిగ్ధత నెలకొంది. వాస్తవంగా ఈ పనుల ఆమోదం కోసం బుధవారం సభ నిర్వహించాలనుకున్నారు. కానీ, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సభ వాయిదా పడింది. సభ జరిగితే..గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రతిపక్షమంటూ లేకపోవడంతో స్వల్ప వ్యవధిలో సభ ముగిసేది. సభాధ్యక్షుడైన మేయర్ ఒక్కమాటతో అన్ని అంశాలు ఆమోదం పొందేవి. సభ జరగకపోవడంతో ఇక కొత్త పాలకమండలి కొలువుదీరాకే వీటికి ఆమోదం లభించనుంది. (చదవండి: జీహెచ్ఎంసీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు) అంత ఈజీ కాదు... మేయర్‌గా టీఆర్ఎస్ అభ్యర్థే గెలిచే అవకాశాలుండటం..అన్నిఅంశాలూ ఆమోదం పొందడమూ సాధ్యమే అయినప్పటికీ, ఇదివరకులా ఈజీగా మాత్రం సభ జరిగే అవకాశాల్లేవు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షం లేదు. టీఆర్ఎస్ సభ్యులు 99 మంది, ఎంఐఎం సభ్యులు 44 మంది ఏకాభిప్రాయంతోనే ఉండేవారు. హాజరయ్యే ఎక్స్‌అఫీషియోలు సైతం అనుకూలంగానే వ్యవహరించేవారు. బీజేపీ సభ్యులు కేవలం నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఉండేవారు. ప్రస్తుతం టీఆర్ఎస్ సభ్యులు 56కు తగ్గడం.. బీజేపీ బలం ఏకంగా 48కి పెరగడం తెలిసిందే. రెండు పార్టీలూ ప్రతి విషయంలో వాదోపవాదాలు, విమర్శలకు దిగుతున్న ప్రస్తుత తరుణంలో బల్దియా సమావేశాల్లోనూ అది ప్రతిబింబించే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. అజెండాలోని అంశాలతోపాటు అప్పటికప్పుడు టేబుల్ అజెండాగానూ పలు అంశాలను సభ ముందుంచి, వెనువెంటనే ఆమోదించిన ఆనవాయితీ కూడా ఉంది. అలాంటిది కూడా ఇకపై జరగబోయే సమావేశాల్లో కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమోదం పొందాల్సిన అజెండాలోని కొన్ని ముఖ్యాంశాలు.. బీఓటీ పద్ధతిలో 201 బస్షెల్టర్ల నిర్మాణం. సికింద్రాబాద్, కూకట్పల్లి, చారి్మనార్, శేరిలింగంపల్లి జోన్లలో రోడ్లపై గుంతల పూడ్చివేసే యంత్రాలకు ఏడాదికి రూ.15.39 కోట్ల అద్దె. హస్తినాపురం శివసాయికాలనీలో చంద్రా గార్డెన్ దగ్గర రూ.3.55 కోట్లతో బాక్స్ డ్రెయిన్, గాయత్రినగర్‌లో రూ.5.25 కోట్లతో బాక్స్‌డ్రెయిన్. సంతోష్‌నగర్ సర్కిల్లోని రెడ్డికాలనీ నుంచి సింగరేణి కాలనీ చౌరస్తా వరకు రూ.5.99 కోట్లతో వరద కాలువ నిర్మాణం. పలు థీమ్‌పార్కుల స్థలాల మార్పు. క్యూ సిటీ నుంచి ఎన్ఐఏబీ వరకు స్లిప్‌రోడ్ నిర్మాణం. మీరాలంచెరువులో గుర్రపుడెక్క తొలగింపు పనులకు రూ.9.50 కోట్లు. లాలాపేటలో రూ.6.9 కోట్లతో మలీ్టపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మాణం. రామచంద్రాపురం సర్కిల్లోని మన్మోల్ గ్రామంలోని సర్వేనెంబర్లు 475 నుంచి 482 వరకు జీహెచ్ఎంసీ పరిధినుంచి తొలగించి తెల్లాపూర్ మునిసిపాలిటీలో కలపడం. -
'ఉదయం షూటింగ్‌లు.. సాయంత్రం బాబుతో మీటింగ్‌లు'
సాక్షి, విజయవాడ : పవన్ కల్యాణ్ రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అని, అతను మాట మీద నిలబడేవాడు కాదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.వెల్లంపల్లి శ్రీనివాస్ మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం విజయవాడలోని భవానీపురం 28వ డివిజన్లో పర్యటించారు.నగర అభివృద్ధే ద్యేయంగా రూ. కోటి 40 లక్షల రూపాయలతో బైపాస్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వీలైనంత తొందరగా రోడ్డు,డ్రైనేజీలు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.(టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం) ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. పవన్ వాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, అది నోరా లేక తాటిమట్టా అని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఆయనను ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఉదయం సినిమా షూటింగ్లో పాల్గొని సాయంత్రం చంద్రబాబుతో మీటింగ్‌లు చేస్తున్నారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. బాబు డైరక్షన్లో బీజేపీ ముసుగులో పవన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అభివృద్ధిని ఆపాలని చూస్తే ఏపీలో ఎక్కడా తిరగలేవని, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే అతనికి సరైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. (బాబుకు చిల్లర రాజకీయాలు అలవాటే: నాని) -
గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం
అనంతగిరి: తమ ప్రభుత్వ పాలనలో గ్రామగ్రామాన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. రూ.90 లక్షలకు పైగా నిధులతో పలు పనులు, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి దశల వారీగా జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. బిల్లులు తప్పకుండా వస్తాయన్నారు. గ్రామాల్లో స్వచ్ఛ్ భారత్ కోసం పాటుపడాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వబోతోందని, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తోందని అన్నారు. గిరిగేట్‌పల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు క ల్పించడానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మద్గుల్ చిట్టంపల్లిలో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిగా ఉన్న పాఠశాల నూతన భవన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతిలో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఎక్కువ టీచర్లున్న పాఠ«శాలల నుంచి డిప్యూటేషన్ చేస్తామన్నారు. ఇందుకు త్వరలో ఎంఈఓలతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనవసరంగా విమర్శించొద్దు: ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ మాజీమంత్రి ప్రసాద్‌కుమార్ మా సీఎం, మంత్రులను అనవసరంగా విమర్శించడం మానుకోవాలన్నారు. ఆయనది కర్నాటక ప్రాంతమని, తాండూర్‌లో వచ్చి స్థిరపడ్డారని అన్నారు. ఈ ప్రాంతప్రజలు మంచోళ్లు కనుక గెలిపించారన్నారు. ఇకముందు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మాజీమంత్రికి అభివృద్ధి కంటే ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు. వికారాబాద్ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు. తాను ఈ ప్రాంతంలో 30 ఏళ్ల నుంచి ప్రజలకు సేవలు చేస్తున్నాన్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ముత్తాహార్ షరీఫ్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, పీఆర్ డీఈ రాజమోహన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, డీటీ కృష్ణయ్య, ఏఓ ప్రసన్నలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నర్సింలు, ప్రభావతిరెడ్డి, మాణెమ్మ, శమంతాపాండు, అరుణ, లక్ష్మయ్య, ఎంపీటీసీ సాయన్న, నాయకులు, నర్సింహరెడ్డి, గోపాల్, వేణుగోపాల్‌రెడ్డి, సురేష్, చందర్‌నాయక్, ప్రభాకర్‌రెడ్డి, రాజమల్లయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల దీవెనలే ప్రభుత్వానికి అండ
ఇల్లంతకుంట : ప్రజల దీవెనలే కేసీఆర్ సర్కారుకు కొండంత అండగా ఉన్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని తిప్పాపూర్‌లో గ్రామపంచాయతీ, యాదవసంఘం, మహిళా సంఘ భవనాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఎస్సీ, మున్నూరుకాపు సంఘం, బస్టాండ్ భవనాలకు కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వేలాది కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం అమలు చేస్తుందని, కావాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎంపీపీ గుడిసె ఐలయ్య, సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ మంజుల, గుండ సరోజన, రాఘవరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సంధ్యారాణి, మల్లయ్య, శ్రీనివాస్, గొడుగు తిరుపతి పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
కోస్గి: ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనకు ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదని.. నియోజకవర్గ అభివృద్ధే ప్రధా న లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి గుర్నాథ్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా తా ను పనిచేసిన సమయంలో అప్పటి ప్రభుత్వాలు సహకరించకపోవడంతో అభివృద్ధి చేసేందుకు వీలు కాలేదని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం సాధ్యమవుతోందన్నారు. కోస్గిలో బస్ డిపో, సీఐ కార్యాలయం, ఫైర్ స్టేషన్ ఏర్పాటుతోపాటు బొంరా స్పేట, దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. నాయకులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి శివాజీ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గుర్నాథ్రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా కలగానే మిగిలిన సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని తెలిపారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా తాను నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని.. కేసీఆర్ తాజాగా కురిపించిన వరాలే ఆయనకు సమాధానమన్నారు. అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్సీ అన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపుతుందని, ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి స్థాయి మరచి చేసే వ్యక్తిగత విమర్శలు, బురదజల్లే రాజకీయాలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరిం చాలని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్న కిష్టప్ప, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జెడ్పీటీసీ అనిత, ఎంపీటీసీ మ్యాకల రాజేష్, నాయకులు బాల్‌రాజ్, శ్యాసం రామకృష్ణ, హన్మంత్‌రెడ్డి, ఓంప్రకాష్, డీకే.నాగేష్, బిచ్చప్ప, వెంకట్‌స్వామి, శ్యాం, మహిపాల్, రమేష్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో ఎంపీ మేకపాటి
నెల్లూరు: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శుక్రవారం తన నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. -
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్ర మాలకు నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. పట్టణంలో నిర్మించనున్న సీసీ డ్రైనేజీతో పాటు బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.