AP CM YS Jagan Vizag Tour On May 11th 2023, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

CM Jagan Vizag Tour Updates: విశాఖలో ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

Published Thu, May 11 2023 3:02 PM | Last Updated on Thu, May 11 2023 10:23 PM

AP CM YS Jagan Vizag Tour May 2023 Updates - Sakshi

CM YS Jagan Vizag Tour Live Updates 

► సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన ముగిసింది.

► ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో.. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు సాహితి, సాయి కార్తికేయలను ఆశీర్వదించారు సీఎం వైఎస్‌ జగన్‌. 

► బీచ్‌ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసింది ఈ మ్యూజియంను. మ్యూజియంను ప్రారంభించిన అనంతరం లోపల అధికారులతో కలియతిరిగి తిలకించారు సీఎం జగన్‌.

► సీ హ్యారియర్‌ మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

► మరికాసేపట్లో.. ఆర్కే బీచ్‌ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్‌ యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభించనున్న సీఎం జగన్‌.

ఆరిలోవలోని అపోలో ఆస్పత్రిలో క్యాన్సర్‌ సెంటర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం అక్కడి సిబ్బందితో ఆయన కాసేపు మాట్లాడి.. వాళ్ల విజ్ఞప్తి మేరకు గ్రూప్‌ ఫొటో దిగారు. అనంతరం క్యాన్సర్‌ యూనిట్‌లోని రేడియేషన్‌ ఎక్విప్‌మెంట్‌ను పరిశీలించారు సీఎం జగన్‌.

► పీఎం పాలెం నుంచి అపోలో హాస్పటల్ కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. మరికాసేపట్లో ఆరిలోవలోని అపోలో క్యాన్సర్‌ సెంటర్‌ ప్రారంభం.



వైఎస్సార్‌ క్రికెట్‌స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ 2 ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజీ ప్లేయర్స్‌తో ముచ్చటించారాయన. క్రీడల్లో మరింత రాణించాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

విశాఖ పర్యటనలో.. పీఎం పాలెంలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో క్రీడాకారులను సీఎం జగన్‌ కలిశారు. మహిళా క్రికెటర్లు సబనామ్‌, అంజలిని ప్రత్యేకంగా అభినందించారాయన. కాసేపట్లో ఏపీఎల్‌ సీజన్‌-2 ను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

వైఎస్సార్‌ స్టేడియంలో ఫొటో ఎగ్జిబిషన్‌న్‌ సందర్శించిన సీఎం జగన్‌.. ఆంధ్ర క్రికెట్‌ అసోషియేషన్‌ సభ్యులతో గ్రూప్‌ ఫొటో దిగారు. 

క్రికెట్‌ స్టేడియంలో దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌. 

► పీఎం పాలెం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.

► కాసేపట్లో పీఎం పాలెం(పోతులమల్లయ్య పాలెం)లోని వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ స్టేడియానికి సీఎం జగన్‌.. దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ.

విశాఖ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం. నగర మేయర్  హరివెంకటకుమారితో పాటు మంత్రి అమర్నాథ్‌, విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు.. సీఎం జగన్‌కు ఆత్మీయ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు.

► పాలనా రాజధానిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు శంకుస్థాపనల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు బయల్దేరారు.

విశాఖ పర్యటనలో భాగంగా.. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి విశాఖకు విమానంలో బయల్దేరారు. నగరంలో వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారాయన.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీలోకి తనయుడితో మాజీ ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement