
కోస్గి: ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనకు ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదని.. నియోజకవర్గ అభివృద్ధే ప్రధా న లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి గుర్నాథ్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా తా ను పనిచేసిన సమయంలో అప్పటి ప్రభుత్వాలు సహకరించకపోవడంతో అభివృద్ధి చేసేందుకు వీలు కాలేదని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం సాధ్యమవుతోందన్నారు. కోస్గిలో బస్ డిపో, సీఐ కార్యాలయం, ఫైర్ స్టేషన్ ఏర్పాటుతోపాటు బొంరా స్‌పేట, దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. నాయకులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి శివాజీ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గుర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా కలగానే మిగిలిన సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని తెలిపారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా తాను నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని.. కేసీఆర్ తాజాగా కురిపించిన వరాలే ఆయనకు సమాధానమన్నారు.
అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్సీ
అన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపుతుందని, ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి స్థాయి మరచి చేసే వ్యక్తిగత విమర్శలు, బురదజల్లే రాజకీయాలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరిం చాలని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అన్న కిష్టప్ప, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జెడ్పీటీసీ అనిత, ఎంపీటీసీ మ్యాకల రాజేష్, నాయకులు బాల్‌రాజ్, శ్యాసం రామకృష్ణ, హన్మంత్‌రెడ్డి, ఓంప్రకాష్, డీకే.నాగేష్, బిచ్చప్ప, వెంకట్‌స్వామి, శ్యాం, మహిపాల్, రమేష్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.