అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేంత వరకు ఉద్యమాలు ఆగవని.. ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు అలుపు లేకుండా శ్రమించాలని వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతపురంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపుతో ఈ నెల 29న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
పార్టీలకతీతంగా.. ప్రతి ఒక్కరు కలిసి రావాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆయన అన్నారు. రాష్ట్రానికి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వంలో తన మంత్రులను కొనసాగిస్తున్న బాబు ప్రత్యేక హోదా ప్రస్థావనే మరిచారని విమర్శించారు.