
అభివృద్ధి పనుల్లో ఎంపీ మేకపాటి
నెల్లూరు: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శుక్రవారం తన నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.