
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే సేవామిత్ర యాప్ ద్వారా అధికార టీడీపీ పార్టీ నేతలు ఓట్లు తొలగించారని ఈసీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ అనుకూలురుకు పోస్టింగులు ఇస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీని కలిసినవారిలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిదఫా ఎన్నికల్లో ఏపీలో ఈ నెల 11న అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ ఒకేరోజు జరగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు నేడు ఈసీని కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment