
సాక్షి, పులివెందుల : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు. వివేకా లేకపోవడం ఆయన కుటుంబానికి ఎంత లోటో.. వైఎస్సార్‌సీపీకి అంతే లోటు అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ‘వివేకా లేని లోటు తీర్చలేనిది. ఆయన మచ్చ లేని, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడాల్సిన సమయం ఇప్పుడు కాదు’ అని వ్యాఖ్యానించారు.
(వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత)
నెల్లూరు : వైఎస్ వివేకానందరెడ్డి ఆకస్మిక మృతిపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు.. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అనంతపురం : వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘వివేకా మరణం వైఎస్సార్‌సీపీకి తీరని లోటు, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన నేత వైఎస్ వివేకా’ అని అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment