సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మద్యం షాపును మహిళలు అడ్డుకున్నారు. ఆశ్రమం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డెక్కారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు, స్థానికుల నినాదాలు చేశారు.
విజయవాడ: కూటమి లిక్కర్ టెండర్లపై వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి నేతల జేబులు నింపడానికే చంద్రబాబు లిక్కటర్ టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిని కూటమి నేతలు బెదిరిస్తున్నారని.. కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తున్నారన్నారు. మరికొందరు బరితెగించి టెండర్ దక్కించుకున్న వారిని కిడ్నాప్ చేస్తున్నారన్నారు.
పేద మహిళల కళ్లలో ఆనందం చూడటమే అప్పటి జగన్ ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు కుటీల రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అవినాష్ అన్నారు.
ప్రకాశం జిల్లా: ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడం చేతకాని ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం సిగ్గుచేటని ఐద్వా ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి.పద్మ మండిపడ్డారు. అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన మద్యం టెండర్ల లాటరీని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి.
మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మద్యం వ్యాపారాన్ని చేస్తుందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment