
సాక్షి, కడప: వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ఓ యువతి తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగారు. భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. బద్వేలుకు చెందిన షరీఫ్.. సాయి ప్రత్యూష ప్రేమించుకున్నారు. దీంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్‌కు తీసుకెళ్లిన షరీఫ్.. అక్కడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్‌లో వదిలేసి.. షరీఫ్ స్వస్థలం తిరిగొచ్చాడు.
తన బంధువుల సాయంతో సాయిప్రత్యూష కూడా స్వస్థలం తిరిగొచ్చారు. ఈ క్రమంలో షరీఫ్ బంధువుల కోరిక మేరకు రెండో పెళ్లికి సిద్ధమవ్వడంతో సాయిప్రత్యూష పోలీసులను ఆశ్రయించారు. అయితే, పోలీసులు కేసు నమోదుచేయకుండా పంచాయతీ పేరిట తాత్సారం చేస్తుండటంతో బాధిత యువతి ఆందోళనకు దిగారు. షరీఫ్ ఇంటి ముందు సాయిప్రత్యూష ఆందోళన కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment