సాక్షి, బద్వేలు: వైఎస్‌ఆర్ జిల్లా బద్వేలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ మండపంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని కళ్యాణ మండపం నిర్వాహకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment