YSR District Crime: Woman Assassinated To Her Own Daughter With Lover - Sakshi
Sakshi News home page

Extramarital Affair: తల్లి పాడు పని.. కూతురు మందలించిందన్న కోపంతో..

Published Mon, Feb 28 2022 3:46 PM | Last Updated on Mon, Feb 28 2022 4:20 PM

Woman Assassinated Her Own Daughter With Lover in YSR District - Sakshi

మృతురాలు వెంకటసుజాత (ఫైల్‌)

బద్వేలు అర్బన్‌(వైఎస్సార్‌ జిల్లా): తన వివాహేతర సంబంధం గురించి మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి సొంత కూతురినే ఓ తల్లి అంతమొందించింది. గత ఏడాది అక్టోబర్‌ 16న జరిగిన ఈ ఘటన అప్పట్లో ఆత్మహత్యగా చిత్రీకరించినప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపి హత్య అని తేల్చారు. ఆదివారం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

చదవండి: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ ఎంట్రీతో రెండో పెళ్లికి రెడీ!

బద్వేలు మండల పరిధి లోని లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన గానుగపెంట వెంకటయ్య, రమణమ్మల కుమార్తె వెంకటసుజాత. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం వరకు చదివింది. రమణమ్మ తమ గ్రామానికి చెందిన గానుగపెంట శ్రీను అలియాస్‌ శీనయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన వెంకటసుజాత తల్లిని మందలించింది. దీంతో రమణమ్మ కుమార్తెను అంతమొందించాలని నిర్ణయించుకుంది.

ప్రియుడు శ్రీను, సమీప బంధువైన ఆటోడ్రైవర్‌ మేకల మల్లెంకొండయ్యతో కలిసి పథకం పన్నింది. అందరూ కలిసి గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతున్న వెంకట సుజాత గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. తర్వాత మల్లెంకొండయ్యకు చెందిన ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడేసి వచ్చారు. తర్వాత సుజాత కనిపించడం లేదని, తండ్రి తాగుడుకు బానిస కావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అందరిని నమ్మించారు.

పోలీసులకు అదే ప్రకారం ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత గ్రామ శివారులోని బావిలో సుజాత మృతదేహం లభ్యమైంది. అయితే తండ్రి ప్రవర్తన నచ్చక వెంకటసుజాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. అటు తర్వాత కేసును పకడ్బందీగా విచారించి మిస్టరీని ఛేదించారు. కేసు విచారణలో చురుగ్గా వ్యవహరించిన అర్బన్‌ సీఐ రామచంద్ర, ఎస్‌ఐ వెంకటరమణలను జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌లు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement