ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న మౌనిక
కేతేపల్లి(నకిరేకల్) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామంలో గురువారం జరగింది.
బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండకిందిగూడెం గ్రామానికి చెందిన పెరిక చంటి నకిరేకల్‌లోని ట్రాక్టర్ షోరూంలో కం ప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి పత్తి తీసేందుకు ఇదే మండలంలోని కొత్తపేట గ్రామం నుంచి కొండకిందిగూడెం వస్తున్న మంద మౌనిక, చంటి ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
చంటి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లోబరుచుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరించాడు. దీంతో బాధితురాలు ఇటీవల కేతేపల్లి పోలీసులను సం ప్రదించింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వటంతో చంటి మూడు రోజులు గడువు కావాలని, తదనంతరం పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు.
పది రోజులుగా మౌనిక ఫోన్ చేస్తుండగా ఎత్తకుండా ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌనిక చంటి ఇంటి ఎదుట ఆదోళనకు దిగింది. ఇది గమనించిన చంటి కుటుంబ సభ్యులు ఉదయమే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మౌనికకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment