‘కట్నం తెస్తేనే అమెరికా తీసుకెళ్తా’
Published Fri, Nov 11 2016 2:55 PM | Last Updated on Fri, May 25 2018 12:56 PM
- అదనపు కట్నం కోసం భర్త వేధింపులు
- అత్తింటి ముందు మహిళ ధర్నా
హైదరాబాద్: కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన మధు, శ్రీలత దంపతులకు ఒక కుమార్తె ఉంది. గత కొంత కాలంగా అమెరికాలో ఉద్యోగరీత్యా ఉంటున్న మధు.. భార్య శ్రీలతను కట్నం కోసం వేధిస్తున్నాడు. వివాహ సమయంలో 50 తులాల బంగారంతోపాటు ఎకరం భూమి ఇచ్చినా అతని కట్న దాహం తీరలేదు. ఇంకా కట్నం తెస్తేనే అమెరికా తీసుకెళతానని తెగేసి చెప్పాడు. ఇందుకు అతని తల్లి, తోబుట్టువులు సహకరిస్తున్నారు. దీంతో శ్రీలత శుక్రవారం కుటుంసభ్యులతో కలిసి అత్తింటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
Advertisement
Advertisement