
జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న బాధితురాలు బోయ సునీత
మంగళగిరి : మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట సోమవారం ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బోయ సునీత ఆరోపించింది. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దామనుకుంటే.. తనను మానసిక వికలాంగురాలిగా చిత్రీకరించారని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.